ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో ఎంతో బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇక మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత, ఎలాగైనా ఈసారి అధికారికంలోకి రావాలని తన పార్టీ కార్యకర్తలు మరియు నాయకులను ఎప్పటికపుడు చైతన్య పరుస్తూ, రాబోయే రోజుల్లో ప్రజల్లోకి యాత్రల పేరుతో కూడా వెళ్లాలనుకుంటున్నట్లు టాక్. ఇకపోతే గత ఏడాది ఆయన కెరీర్ 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి అతి పెద్ద డిజాస్టర్ గా నిలవడం, అలానే అప్పటినుండి పవన్ పై ఫ్యాన్స్ మరొక సినిమా కోసం ఒత్తిడి చేస్తూ ఉండడం గత కొద్దిరోజులుగా జరుగుతూ ఉంది. అయితే ఎట్టకేలకు ఫ్యాన్స్ మొర ఆలకించిన పవన్

 

ఇటీవల బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పింక్ అనే సినిమా రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో నటించబోతున్నారు. కాగా ఈ సినిమా కోసం అప్పుడే అతి పెద్ద కోర్ట్ హాల్ సెట్టింగ్ ని సినిమా యూనిట్ మొదలెట్టిందట. ఇక ఈ సినిమాకు లాయర్ సాబ్ అనే టైటిల్ ని కూడా సినిమా యూనిట్ పెట్టాలని భావిస్తున్నట్లు టాక్. ఇకపోతే ఈ సినిమా విషయమై నిన్న దిల్ రాజు మరియు బోనీ కపూర్ కూడా తమ సన్నిహితులతో అధికారికంగా మాట్లాడుతూ అతి త్వరలో సినిమాను ప్రారంభిస్తున్నాం అని తెల్పడం జరిగిందట. 

 

అయితే ఇక్కడే కొంత చిక్కు సమస్య వచ్చిందని అంటున్నారు. అదేమిటంటే, ఈ సినిమాను తెరకెక్కించనున్న వేణు శ్రీరామ్ స్క్రిప్ట్ వర్క్ ని ఆల్మోస్ట్ పూర్తి చేసాడని, అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయ కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండడం వలన ఈ సినిమా మరొక రెండు నెలల వరకు పట్టాలెక్కే అవకాశం లేదని సమాచారం. అయితే ఈ విషయమై పవన్ కూడా కొంత ఆలోచన చేసి, సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసేలా యోచన చేస్తున్నారట. ఇక అన్నీ కుదిరితే అతి త్వరలో రాబోయే అధికారిక ప్రకటనలో పవన్ ఎప్పుడు సినిమాను మొదలెడతారు అనే విషయం తేటతెల్లం అవుతుందని అంటున్నారు. మరి అప్పటివరకు ఈ సినిమా దర్శక నిర్మాతలు కళ్ళు కాయలు కాచే వరకు వెయిట్ చేయక తప్పేలా లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు...!!  

మరింత సమాచారం తెలుసుకోండి: