పవన్ కళ్యాణ్ తో ‘పింక్’ రీమేక్ చేయాలని దిల్ రాజ్ భావించిన నాటినుండి ఈ సినిమాకు అనేక సమస్యలు ఎదురు అవుతూనే ఉన్నాయి. ఈ రీమేక్ విషయంలో పవన్ ఇప్పటికి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోక పోవడం ఒక సమస్యగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు నుంచి డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అదేవిధంగా నిర్మాణ సంస్థ హారిక హాసిని పక్కకు తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘పింక్’ రీమేక్ స్క్రిప్ట్ త్రివిక్రమ్ తయారుచేయడానికి హారిక హాసిని సంస్థ భాగస్వామ్యం తీసుకోవడానికి మొదటి నుంచీ  ఆసక్తి కనపరచాయి. ఈ మూవీకి నిర్మాతగా వ్యహరిస్తున్న 
దిల్ రాజ్ వ్యవహార శైలి వేణు శ్రీరామ్ చేత స్క్రిప్ట్ రాయించుకోవాలనే దిల్ రాజ్ ఆలోచన త్రివిక్రమ్ కు నచ్చకపోవడంతో త్రివిక్రమ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న హారిక హాసాని సంస్థ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అంటూ గాసిప్పులు ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాయి. 

ప్రస్తుతం ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే దిల్ రాజ్ కు  కుటుంబ పరంగా వైకాపా పార్టీతో సంబంధాలు ఉన్నాయని ఆపరిచియాలతోనే ఆ మధ్య దిల్ రాజ్ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబెర్ గా ప్రయత్నించాడు అని అంటారు. ఈ మధ్య కాలంలో పవన్ జగన్ ను టార్గెట్ చేస్తూ విపరీతంగా కామెంట్స్ చేస్తున్న పరిస్థితులలో దిల్ రాజు ఇప్పుడు పవన్ తో సినిమా చేస్తే దిల్ రాజ్ కుటుంబ సభ్యులకు రాజకీయంగా సమస్యలు ఎదురు అవుతాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ నుండి నెమ్మదిగా తప్పుకోవచ్చు కదా అంటూ దిల్ రాజ్ సన్నిహితులు ఆయనకు సలహాలు ఇస్తున్నట్లు టాక్. 

అయితే పవన్ తో సినిమా తీయడం తన జీవిత ధ్యేయంగా భావిస్తున్న దిల్ రాజ్ ఈ సలహాలను లెక్క చేయకుండా రాజకీయాలకు సినిమాలకు సంబంధం ఏమిటి అంటూ తనకు సలహాలు ఇస్తున్న వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఇన్ని ప్రాధమిక సమస్యలు తట్టుకుని ‘పింక్’ నిజంగానే ప్రారంభం అయి విడుదల కాగాలుగుతుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: