టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున... సీనియర్ హీరో  అయినప్పటికీ యువ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు.ఈ  హీరో సీనియర్ హీరో అంటే  కూడా కొంతమంది ఉంటారు ఎందుకంటే పెరుగుతుంది. కానీ ఆయన వయసు పెరుగుతుంది కానీ  అందం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోయింది.. ఇక నాగార్జున ఫిట్నెస్ విషయంలో యువ హీరోలు కూడా ఆయన ముందు పనిచేయారు. ఫిట్నెస్  అంత స్ట్రిక్ట్ గా  ఉంటారు నాగార్జున. ఐదు పదుల వయసులో కూడా ఇంకా యంగ్  గానే కనిపిస్తుంటారు. ఇదిలా ఉంటే ఎవరు సాధించలేని ఓ అరుదైన రికార్డును సాధించారు మన్మథుడు నాగార్జున. టాలీవుడ్లోనే కాదు ప్రపంచ చరిత్రలోనే రికార్డు ఎవరు సాధించి ఉండకపోవచ్చు కూడా. ఇంతకీ నాగార్జున రికార్డ్ ఏం రికార్డ్  సాధించారంటే. 

 

 

 

 సినిమాల్లో హీరోయిన్లు తండ్రుల  సరసన నటించిన హీరోయిన్లు కొడుకుల సరసన నటించరు... అలాగే కొడుకుల సరసన నటించిన హీరోయిన్ లు  సరసన తండ్రుల సరసన  నటించడం కూడా చాలా రేర్ గా చూస్తుంటాం . అయితే నాగార్జున మాత్రం ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు సరసన నటించిన శ్రీదేవి రాధ లతో  ఆయన తనయుడు అయిన నాగార్జున ఎన్నో  సినిమాల్లో  జోడీగా నటించారు. అయితే నాగార్జున  తండ్రి సరసన నటించిన హీరోయిన్ల తోనే  కాదు... కొడుకుల సరసన నటించిన హీరోయిన్లతో  కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నాగచైతన్య కు జోడిగా నటించిన లావణ్య త్రిపాటి తో సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించాడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. 

 

 

 నాగచైతన్య కు జోడిగా రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాలో  నటించిన రకుల్ ప్రీత్ సింగ్ తో  మన్మథుడు 2  లో నాగార్జున నటించాడు. ఇక ఇప్పుడు కొత్త దర్శకుడు సాలోమెన్   దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నాగార్జునకు జోడీగా కాజల్ నటించబోతున్నట్లు సమాచారం. అయితే కాజల్ అగర్వాల్ నాగ చైతన్య సరసన దడ  సినిమాలో నటించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా కాజల్ అగర్వాల్ యువ హీరోలతోనే కాదు...  సీనియర్ హీరోల సరసన కూడా మెరుస్తుంది . కాగా  అటు తండ్రి సరసన నటించిన హీరోయిన్ లతో పాటు తనయుడు నాగచైతన్య సరసన నటించిన అందాల భామలతో కూడా జోడిగా నటించి వెండితెరపై సరికొత్త రికార్డు సృష్టించాడు నాగార్జున. అయితే తోటి హీరోలైన బాలయ్య వెంకటేష్ చిరంజీవి లకు ఈ  రికార్డు సాధ్యం కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: