టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున నటించిన ‘శివ’ సినిమాతో తన ప్రస్థానం మొదలు పెట్టిన రాంగోపాల్ వర్మ సినిమాల్లో ఓ సరికొత్త విలనీజం తీసుకువచ్చారు.  సమాజంలో అచ్చం రౌడీలు అంటే ఇలాగే ఉంటారని..మాఫియా అంటే ఇలాగే ఉంటుందేమో అనేలా తన సినిమాల్లో విలన్లను చూపించాడు.  ఇక మని సినిమాతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు..రేవతి నటించిన ‘దెయ్యం’ మూవీతో థియేటర్లో ఒంటరిగా కూర్చొని చూస్తే కళ్లు చెదిరే బహుమతి ఇస్తానని చెప్పి ఛాలెంజ్ చేశారు వర్మ.  ఇలా తనదైన మార్క్ వేసుకుంటూ వెళ్తున్న రాంగోపాల్ వర్మ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం అక్కడ మాఫియా, హర్రర్ సినిమాలతో దుమ్మురేపడం జరిగింది.  గత కొంత కాలంగా బాలీవుడ్ లో వరుస డిజాస్టర్లతో తట్టుకోలేక తిరిగి టాలీవుడ్ లోనే తన ప్రతాపాన్ని చూపాలనుకున్నారు.  

 


ఈ నేపథ్యంలో పలు సినిమాలు తీస్తూ వస్తున్నారు.  అయితే వర్మసినిమా తీసినా అందులో ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం షరా మూములుగా మారింది.  ఈ నేపథ్యంలోనే ఏపిలో జరిగిన ఎన్నికల సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రాజకీయ ప్రకంపణలు సృష్టించింది. ఎంతగా అంటే టీడీపీ నేతలు ఈ మూవీని బ్యాన్ చేయాలని.. ఏకంగా ఈసీ జోక్యం చేసుకొని ఎన్నికల తర్వాత రిలీజ్ అయ్యేలా చేయడం..ఆ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశారు.  తాజాగా రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీ టైటిల్ పై విమర్శలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. 

 

ఈనెల 29న విడుదల కానున్న ఈ సినిమాకు ఇదే టైటిల్‌తో సెన్సార్‌కు వెళ్లితే తిరస్కరణ తప్పదనే భావనతో టైటిల్‌ను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.  ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అనే టైటిల్‌ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చారు. ఇక  ఈ సినిమాలో తనను కించపరుస్తూ చూపించారని సినిమాను వాయిదా వేయాలని కోర్టుకెక్కారు కేఏ పాల్. మరోవైపు చంద్రబాబు, లోకేష్ బాబులను కించపరుస్తూ కొన్ని సీన్లు ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ... మూవీ పేరు మారుస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: