ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. రేపు ఈ సినిమా విడుదల కాబోతుంది. హైకోర్టులో ఈ సినిమాపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్ పై ఉత్తర్వులు వెలువడనున్నాయి. రామ్ గోపాల్ వర్మసినిమా టైటిల్ మార్చాల్సి వస్తే అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ పెడతానని ప్రకటన చేశారు. 
 
నిన్న రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా విశేషాలను వెల్లడించడానికి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ పాత్ర లేదని రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్లు విడుదలయ్యాయి. కానీ ఈ రెండు ట్రైలర్లలో బాలయ్య పాత్ర ఎక్కడా కనబడలేదు. బాలయ్య పాత్ర ఈ సినిమాలో ఉంటుందా..? లేదా..? అనే అనుమానాలకు వర్మ సమాధానంతో క్లారిటీ వచ్చినట్లే అని చెప్పవచ్చు. 
 
ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖులైన వారందరినీ రామ్ గోపాల్ వర్మసినిమా ట్రైలర్లో చూపించాడు. సీఎం జగన్, చంద్రబాబు నాయుడు, కేఏ పాల్, నారా లోకేశ్, ఇతర ముఖ్య పాత్రలను ఈ సినిమాలో చూపిస్తున్న రామ్ గోపాల్ వర్మ బాలకృష్ణ పాత్రను మాత్రం చూపించకపోవడం గమనార్హం. మరోవైపు ఈ సినిమా సెన్సార్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. 
 
సినిమా విడుదలకు ఇంకా ఒక్కరోజు సమయం మాత్రమే ఉండటంతో ఈ సినిమా సెన్సార్ గండం దాటుతుందా...? లేదా...? చూడాల్సి ఉంది. వర్మ కొత్త టైటిల్ తో సెన్సార్ బోర్డ్ అనుమతి కొరకు వెళ్లనున్నారని సమాచారం. ఈ సినిమా సెన్సార్ గండాన్ని దాటితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 800 థియేటర్లలో విడుదలవుతుంది. ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: