ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. టీనేజ్ కుర్రాడు. అప్పటి హీరోలను వెండితెర మీద చూసి తాను కూడా సినిమాల్లో నటించాలని ఉబలాటపడిన చిన్నవాడు. ఇక అప్పట్లో వరసగా సినిమాలు తీసి కొత్త టాలెంట్ ని ప్రోత్సహించే ఉషా కిరణ్ మూవీస్ చేసిన ఒక ప్రయోగంతో చిత్రంగా చిత్రం మూవీకి హీరో అయిపోయాడు.  ఆ చిత్ర డైరెక్టర్ తేజా కూడా సినిమా ఫోటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా ఫస్ట్ టైం యాక్షన్ అంటూ కెమెరా వెనకకు వచ్చాడు.

 

ఇక సినిమా  సూపర్ డూపర్ హిట్ కావడం కాదు, యూత్ ఐకాన్ గా ఉదయ్ కిరణ్ ని మార్చేసింది. ఉదయ్ కిరణ్ బ్యాక్ టు  బ్యాట్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. అప్పటి టాప్ స్టార్స్ మూవీస్ కూడా వెనక్కు జరిగిపోయేటంత స్టార్ డం ని సంపాదించుకున్నాడు. ఉదయ్ కిరణ్ ఈ మిలీనియం ఆరంభంలో చిత్రం హీరోగా వచ్చి టాలీవుడ్ ని కొత్త మలుపు తిప్పాడు.

 

దాంతో అప్పటి టాప్ హీరోలకు ఒక విషయం అర్ధమైంది. తాము వయసు మీరామని, టీనేజర్లకు కనెక్ట్ కాలేకపోతున్నామని. దాంతో ఉదయ్ కి పోటీగా తమ ఫ్యామిలీ హీరోలను రంగంలోకి దింపారు. ఆ తరువార వారే స్టార్ ఇమేజ్ తో ముందుకు వచ్చారు. ఇదిలా ఉండగా ఉదయ్ కిరణ్ ప్రభావంతో అనేకమంది యువ  హీరోలు సినీ రంగ ప్రవేశం చేసినా కూడా నిలదొక్కుకోలేకపోయారు.

 

కారణం అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన టాప్ హీరోలు తమ వారసులను ముందు వరసలో నిలబెట్టి గట్టి పోటీ ఇవ్వడం వల్ల. ఇక ఉదయ్ కిరణ్ జీవితం కూడా చిత్రంగా సాగింది. ఆయన మొదటి పెళ్ళి నిశ్చితార్ధం దాకా వచ్చి వెనక్కి పోవడం, ఆ తరువాత ఆయన సినిమా అవకాశాలు తగ్గడం, ఇందులో కూడా సినిమా రాజకీయాలు బోలెడు ఉన్నాయని అంతా అనడం ఇలా చాలా జరిగాయి.

 

ఇవన్నీ ఇలా ఉంటే ఉదయ్ కిరణ్ తన ప్రాణం అనుకున్న సినిమా రంగం నుంచి తాను సైడ్ కావడాన్ని జీర్ణించుకోలేక 2014 జనవరి 6 న ఉరి వేసుకుని ఈ లోకం నుంచే వీడిపోయారు. అంటే సినిమా కోసమే బతికి సినిమా కోసమే ఉదయ్ మరణించాడన్నమాట. చిత్రంగా హీరో అయిన ఉదయ్ సినీ కెరీర్ మొత్తం కలిపితే 14 ఏళ్ళ పాటు ఉంటుంది. ఇందులో ఆయన వ్యకిగత జీవితమే హైలెట్. ఎవరికీ చెప్పుకోలేని మానసిక సంఘర్షణ నిజ జీవితంలో ఉదయ్ కిరణ్ అనుభవించాడు.

 

ఉదయ్ ని ఉరి కంబం దాకా తీసుకెళ్ళిన పరిస్థితులు విలన్లు అనుకుంటే ఆ పరిస్థితులు ఏర్పడడం వెనక కారకులు ఎవరు అన్న ప్రశ్నలు వస్తాయి. అలా చూసుకున్నపుడు ఉదయ్ బయోపిక్ లో హీరొ ఉంటాడు. అంత కంటే గట్టిగా విలన్ ఉంటాడు. మరి ఆ విలన్ని కరెక్ట్ గా చూపించగలిగితేనే బయోపిక్ కి అర్ధం ఉంటుంది. మిగిలిన యువ హీరోలకు, సినిమా రంగంలోకి రావాలనుకుంటున్న వారికి ఇది ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అలా ఉదయ్ లైవ్ ని  టోటల్ గా   కధను కరెక్ట్ గా చెప్పగలిగే దమ్ము ఉందా అన్నదే ఇక్కడ పాయింట్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: