టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో కింగ్ నాగార్జున వయసు ఎంత మీద పడినా గాని బాడీ మెయింటైన్ చేయటం లో మరియు యంగ్ గా కనిపించడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా ‘సోగ్గాడు’ సినిమా తర్వాత చేసిన సినిమాలు చాలా వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న తరుణంలో తన కెరియర్ లో సూపర్ డూపర్ హిట్ అయిన ‘మన్మధుడు’ సినిమా సీక్వెల్ ఇటీవల తెరకెక్కించడం జరిగింది కానీ ఆశించిన స్థాయిలో ఆ సినిమా కూడా ఆడకపోవడంతో తాజాగా నాగార్జున ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర కలిగిన 'శివమణి' టైప్ సినిమా చేయటానికి రెడీ అయినట్లు అది ఓ డెబ్యూ దర్శకుడు చెప్పిన స్టోరీ తో సినిమా చేయడానికి నాగార్జున ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి.

 

ఇదిలా ఉండగా ఈ సినిమాలో నాగార్జున పక్కన స్టార్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించడానికి అయినట్లు సమాచారం. కాజల్ అగర్వాల్ గతంలో నాగార్జున కొడుకు నాగచైతన్య తో ‘దడ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తండ్రి నాగార్జునతో కాజల్ అగర్వాల్ నటించడానికి ఓకే చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

అయితే అధికారికంగా మాత్రం ఈ వార్త ఇంకా బయటకు రాకపోయినా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న న్యూస్ ఇది. ఇదిలా ఉండగా వయసు ఎంత మీద పడిన ఆరు పదుల వయసు వచ్చిన...నాగార్జునతో ఇటీవల మన్మధుడు సీక్వెల్ సినిమాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓకే చెప్పగా తాజాగా కాజల్ అగర్వాల్ నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..ఎంత సీనియర్ హీరో అయినా నాగార్జునతో మాత్రం సినిమా చేయడానికి స్టార్ హీరోయిన్లు ఎగబడుతూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: