యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఎక్కడ.. అదేంటి అతను ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో ఉన్నాడు కదా మరి అలాంటిది అతనెక్కడ అని ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నారు అంటే. ఇది ఎవరో అడుగుతున్నది కాదు నందమూరి ఫ్యాన్స్ అడుగుతున్న మాటే. అలా ఎందుకు అంటే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ మొదలైన దగ్గర నుండి తారక్ ఫ్యాన్స్ కు టచ్ లో లేడు. 

 

ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. అయితే సినిమాలో అతని లుక్ రివీల్ కాకూడదనే ఆలోచనతోనే తారక్ మీడియా ముందుకు రావట్లేదని టాక్ వినిపిస్తుంది. అయితే అదే సినిమాలో నటిస్తున్న రాం చరణ్ మాత్రం తరచు మీడియాలో కనిపిస్తున్నాడు. కాకపోతే చరణ్ లుక్ లో అంత కొత్తగా అనిపించడం లేదు. మీసపు కట్టుతోనే అలరిస్తున్నారు.      

 

అయితే తారక్ మాత్రం దాదాపు ఒక ఆరు నెలల నుండి మీడియా ముందుకు రావట్లేదు. ఈ విషయంపై నందమూరి ఫ్యాన్స్ దిగులుగా ఉన్నారు. అంతేకాదు ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ ఎవరితో సినిమా చేస్తాడన్న విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్.టి.ఆర్ మళ్లీ త్రివిక్రం డైరక్షన్ లోనే తర్వాత సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

 

లాస్ట్ ఇయర్ ఈ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత మంచి విజయాన్ని అందుకుంది. అందుకే అదే కాంబినేషన్ లో మరో సినిమా చేయాలని చూస్తున్నాడు ఎన్.టి.ఆర్. మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది.. దీనికి సంబందించిన డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమా 2020 జూలై 30న రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఆ సినిమా రిలీజ్ లేట్ గా వస్తే మాత్రం ఎన్.టి.ఆర్ తర్వాత సినిమా మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ కాంబో మళ్లీ ఎలాంటీ సెన్సేషనల్ మూవీ అందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: