తండ్రి చిరంజీవి రాజకీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవికి సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటూ కొణిదెల ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ నిర్మించే సినిమాలు నిర్మిస్తూ కెరియర్ రాణిస్తున్నారు రామ్ చరణ్. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సౌత్ ఇండియా భారీ మల్టీస్టారర్ సినిమా…  rrr సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా...బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాగా మంచి క్రేజ్ ని సంపాదించింది.

 

ఇటువంటి నేపథ్యంలో తండ్రి చిరంజీవి ఇటీవల 90 లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనతోపాటు నటించిన నటీనటులను ఒకచోట సమావేశం అయ్యే విధంగా సరికొత్త యూనియన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కలుస్తూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చిరంజీవి కొత్తగా కట్టుకున్న ఇంటిలో ఈ యూనియన్ మొత్తం సమావేశం కావడంతో ఈ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్న రామ్ చరణ్ తాజాగా తాను కూడా తన తండ్రి చిరంజీవి మాదిరిగానే సరికొత్త ప్లాన్ వేయటానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

 

విషయంలోకి వెళితే ప్రస్తుతం ఉన్న తరం నటీనటులతో కలసి ఒక సపరేటు యూనియన్ ఏర్పాటు చేయటానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధమవుతున్నట్లు...అన్నీ కుదిరితే వచ్చే ఏడాది 2020 నాటికి రీ యూనియన్ పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి రామ్ చరణ్ వేస్తున్న కొత్త ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: