తెలుగు లో ఇప్పటి వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వస్తున్న పాపులర్ షో ‘జబర్ధస్త్’.  ఏడేళ్ల క్రితం ప్రారంభం అయిన ‘జబర్ధస్త్’ కి జడ్జీలుగా మెగా బ్రదర్ నాగబాబు, నటి, ఎమ్మెల్యే రోజా వ్యవహరిస్తున్నారు.  అప్పుడప్పుడు వారు విరామం తీసుకుంటున్నా తిరిగి ‘జబర్ధస్త్’ కొనసాగుతూ వస్తున్నారు.  అంతే కాదు ఆ మద్య ‘జబర్ధస్త్’ నుంచి రోజా ఔట్..నాగబాబు ఔట్ అంటూ తెగ వార్తలు వచ్చాయి.  తాజాగా ఆ వార్తలు నిజం చేస్తూ మెగా బ్రదర్ ‘జబర్ధస్త్’ ఔట్ అయిన విషయం తెలిసిందే.  మొదటి నుంచి ఈ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ వచ్చిన మెగా బ్రదర్ నాగబాబుతో పాటు పేరు మోసిన కమెడియన్లు కొందరు ఈ మధ్యే దీనికి గుడ్‌బై చెప్పి.. మరో ఛానెల్‌లో షోకు వెళ్లిపోయారు. 

 

 ఆయనతో పాటు మరికొంత మంది కమెడియన్లు సైతం వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘లోకల్ గ్యాంగ్స్’  ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది. అందులో నాగబాబు జడ్జీగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. దాంతో జబర్ధస్త్  రేటింగ్‌ను పడిపోకుండా చాలా కేరింగ్ తీసుకుంటోన్న నిర్వాహకులు.. ఈ షోలో పాల్గొంటున్న అందరికీ రెమ్యునరేషన్ పెంచినట్లు టాక్ వినిపిస్తోంది. జడ్జి రోజాకు భారీగా రెమ్యునరేషన్‌ పెంచినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు ఒక్కో ఎపిసోడ్‌కు రోజా రూ.3 నుంచి రూ.4లక్షలు తీసుకుంటున్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు అది డబుల్ అయిందని సమాచారం.  

 

సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్‌కు రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేశారని తెలుస్తోంది. సుడిగాలి సుధీర్‌కు 5లక్షలు.. ఆదికి 4.5లక్షలు పెరిగిందని వార్తలు వస్తున్నాయి.  అయితే చమ్మక్ చంద్ర మరికొంత మంది టీమ్ సభ్యులు జంప్ అయినట్లు తెలుస్తుంది. ఇక అదిరే అభికి 3లక్షలు, రాకెట్ రాఘవ 3.5లక్షలు, భాస్కర్ అండ్ టీం 2లక్షలు., చలాకీ చంటికి 2లక్షలు ముట్టనుందని సమాచారం. కెవ్వు కార్తీక్, ముక్కు అవినాష్, సునామీ సుధాకర్ లకు కూడా లక్షల్లో రెమ్యూనరేషన్ అందతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా జబర్ధస్త్ లో నాగబాబు వెళ్లిపోవడం.. టీమ్ సభ్యులకు జాక్ పాట్ కొట్టినట్టయ్యిందని అంటున్నారు జబర్ధస్త్ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: