ప్రపంచ వ్యాప్తంగా జరిగే రియాలిటీ షోలు ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన బిగ్‌బాస్‌ షో మీద ఇప్పటికే అనే వివాదాలు చుట్టుముడుతున్నాయి. అందులో ఇప్పుడు తాజాగా చేజ్‌ మీ అనే చైనా రియాలిటీ షో కూడా వార్తల్లో నిలిచింది. ఈ షోలో కంటెస్టెంట్‌ చేసిన స్టంట్‌ చూసి అక్కడికి అతిధిలా వచ్చిన ఓ నటుడు మృతి చెందడం ఇప్పుడు సంచలనంగా మారింది.  

 

 

ఇక పూర్తి వివరాలు పరిశీలిస్తే  చైనాలో చిత్రీకరణ జరుగుతున్నో ఓ టీవీ షోకు ప్రముఖ మోడల్‌, యాక్టర్‌ గాడ్‌ఫ్రే గావో (35) అతిథిగా హాజరయ్యాడు. చేజ్‌ మీ అనే టీవీ రియాలిటీ షో చిత్రీకరణ చూస్తూ అక్కడికక్కడే ఆయన హఠాత్తుగా కిందపడిపోయారు. వెంటనే అక్కడున్న తోటివారు స్పందించి గాడ్‌ఫ్రే గావో ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. షోలో భాగంగా కంటెస్టెంట్‌ చేసిన స్టంట్స్‌ చూసి ఆయనకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చి ఉంటుందని అక్కడి డాక్టర్లు అభిప్రాయపడ్డారు.

 

 

ఇకపోతే తైవాన్‌కు చెందిన గాడ్‌ఫ్రే గావో ముందుగా ఫ్యాషన్‌ మోడల్‌గా అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు లూయిస్‌ విట్టన్‌ సంస్థకు మోడల్‌గా వ్యవహరించిన తొలి ఏసియన్‌ మోడల్‌కూడా గాడ్‌ఫ్రేనే కావటం విశేషం. పలు హాలీవుడ్‌, చైనీస్‌ సినిమాలోను నటించిన గాడ్‌ఫ్రే.. నటుడిగానూ తన మార్క్‌ చూపించాడు. ఇకపోతే చేజ్‌ మీ అనే చైనా రియాలిటీ షో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో ఆకర్శిస్తూ విన్నూతంగా కొనసాగుతుంది.

 

 

ఈ షోలో ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు మూడు గంటల పాటు గాడ్‌ఫ్రేను కాపాడేందుకు అక్కడున్న వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ సంఘటనపై చేజ్‌ మీ నిర్వహకులు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. సంఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న డాక్టర్లు స్పందించి ప్రథమ చికిత్స అందించారు. తరువాత హాస్పిటల్‌కు తీసుకెళ్లి గాడ్‌ఫ్రేను కాపాడేందుకు అన్ని రకాలుగా కృషి చేశారు. కానీ ఫలితం దక్కలేదు. ఈ ఘటన పట్ల మేం తీవ్రం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాం అంటూ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. షో నిర్వాహకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: