బిగ్ బాస్ మూడవ సీజన్ అయిపోయి చాలా రోజులు కావొస్తున్నా బుల్లితెర మీద ఆ ఇద్దరి కంటెస్టెంట్ల సందడి జోరుగా ఉంది. ఏ ప్రోగ్రామ్ లోనైనా వారే కనిపిస్తున్నారు. ఆ ఇద్దరే రాహుల్ ,పునర్నవి. ఈ సీజన్ లో విజేతగా నిలిచిన రాహుల్ కి మధ్యలోనే ఎలిమినేట్ అయిన పునర్నవికి మధ్య చాలా మంచి రిలేషన్ ఉంది. హౌస్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్ అయింది. నాగార్జున కూడా పదే పదే వీరిద్దరి టాపిక్ తీసుకొచ్చి మాట్లాడేవాడు.

 


అయితే హౌస్ లోంచి బయటకొచ్చిన తర్వాత టీవీ ప్రోగ్రాముల్లో వీరి సందడి మరింత ఎక్కువైంది. అటు యూట్యూబ్ లోనూ, బుల్లితెర మీద వీరిద్దరినీ ఉపయోగించుకుని టీఆర్పీలు పెంచుకుంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య జనాలు అనుకుంటుకున్నటువంటి రిలేషన్ లేదని, కేవల పునర్నవి తనకు స్నేహితురాలు మాత్రమేనని రాహుల్ ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు. అయినా కూడా ఏదో ఒక రూపంలో వీరి రిలేషన్ గురించి ప్రచారం మాత్రం ఆగట్లేదు. 

 

అయితే ప్రస్తుతం రాహుల్ పునర్నవితో ఉన్న బంధాన్ని క్యాష్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడట. రాహుల్ సిప్లిగంజ్ యూట్యూబ్ లో మ్యూజిక్ వీడియోలు చేస్తాడని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పునర్నవితో కలిసి ఒక మ్యూజిక్ వీడియీ చేద్దామనే ప్లాన్ లో ఉన్నాడట. ఇప్పటి వరకు రాహుల్ వీడియోలకి యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు పునర్నవి కూడా కలిస్తే వ్యూస్ మరింత పెరుతాయనే ఉద్దేశ్యంతో ఉన్నాడట.

 

ఇద్దరి మధ్య చాలా మంచి కెమిస్ట్రీ వుంది కనుక ఏ పెద్ద మ్యూజిక్‌ ఛానల్‌ అయినా ఫండింగ్‌ చేయడానికి ముందుకొస్తుంది. పునర్నవికి కూడా ఎలాగో చెప్పుకోతగ్గ సినిమాలు లేవు కనుక ఈ విధంగా తన పాపులారిటీ పెంచుకునే వీలుంటుంది. మరి ఈ ఇద్దరి మ్యూజిక్ వీడియో ఎప్పుడు బయటకి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: