క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ను చూశాక మెగా పవర్ స్టార్ రాం చరణ్ కు ఒక క్రేజీ థాట్ వచ్చినట్టు తెలుస్తుంది. 1980ల కాలం నాటి హీరో హీరోయిన్స్ అందరు కలిసి ప్రతి సంవత్సరం కలిసి పార్టీ చేసుకుంటారు. కొన్నాళ్లుగా సక్సెస్ ఫుల్ గా జరుగుతున్న ఈ పార్టీ ఈ ఇయర్ చిరు ఇంట్లో జరిగింది. చిరుతో పాటుగా అప్పటి స్టార్ హీరోలు, హీరోయిన్స్ తో రాం చరణ్ కూడా కనిపించాడు.

 

అయితే ఈ పార్టీ చూసిన చరణ్ కు తన బ్యాచ్ తో కూడా ఇలాంటి ఒక పార్టీ ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. తెలుగులో ఉన్న ప్రస్తుత స్టార్స్ తో పాటుగా తమిళ, హింది, మళయాళ, కన్నడ స్టార్స్ అందరితో రాం చరణ్ పార్టీ ప్లాన్ చేస్తున్నాడట. ఇది కేవలం ఒక్క ఇయర్ మాత్రమే కాదు ప్రతి సంవత్సరం ఇలానే పార్టీ చేసుకునేలా ఆలోచన చేస్తున్నాడట. 

 

ఎన్.టి.ఆర్, మహేష్, చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా తెలుగు స్టార్స్ అంతా ఒకచోట కలిస్తే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. అయితే సీనియర్ స్టార్స్ అంటే షెడ్యూల్ అడ్జెస్ట్ మెంట్ చేయగలరు కాని ప్రస్తుతం స్టార్స్ అలా కాదు వారు చాలా బిజీగా ఉంటున్నారు. చరణ్ ప్లాన్ సక్సెస్ అయ్యి స్టార్స్ అంతా కలిసి ఓ పార్టీ చేసుకుంటే మాత్రం అది కచ్చితంగా సంచలనమే అని చెప్పొచ్చు.

 

అయితే మిగతా భాషల హీరోల గురించి చెప్పడం కష్టమే కాని తెలుగులో ఉన్న స్టార్స్ అంతా ఈ పార్టీకి అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్న తెలుగు స్టార్స్ అంతా ఒకచోట కలిస్తే ఆ హంగామా వేరేలా ఉంటుంది. చరణ్ ప్లాన్ కు ఎంతమంది ఆమోదం తెలుపుతారో చూడాలి. ప్రస్తుతం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: