విభిన్నమైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూకుడు మీదున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... విభిన్న కథా నేపథ్యం ఉన్న చిత్రాలతో అలరిస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. ఇక మరోవైపు ఓటమెరుగని దర్శకునిగా తన సినిమాలంటే మినిమమ్ ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగించి వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాపై  రోజురోజుకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తుంది. 

 

 కాగా ఈ సినిమాలో ఇప్పటివరకు మహేష్ బాబు తన సినీ కెరీర్లో నటించని ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కి కూడా ఒక రేంజ్ లో  రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ యాక్షన్ దర్శకుడి కామెడీ టైమింగ్ అన్ని కలగలిపి అదరగొట్టే లా కనిపించింది. అంతేకాదండోయ్ ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న కూడా నటిస్తోంది.ఏ  హీరో పక్కన నటించినా ఆ హీరోకి సరైన చూడు అనిపించేలా నటన హావభావాలు పలికిస్తూ ఉంటుంది అమ్మడు . అందుకే ఏ  హీరో పక్కన నటించిన పర్ఫెక్ట్ జోడిగా  నిలుస్తూ ఉంటుంది రష్మిక మందన. ఈ సినిమాలో విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతుంది  కూడా.

 


 కాగా తాజాగా  మహేష్ బాబు అభిమానులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. దీంతో అభిమానులందరూ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అంటున్నారు. సెక్స్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ బాబు కాంబినేషన్లో  తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కాకా అభిమానుల కోసం సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అనే సినిమా విడుదల అయ్యేంత  వరకు ప్రతి సోమవారం అభిమానుల కోసం ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తమ అభిమాన హీరోల గురించి ఎప్పుడో  కానీ ఒక అప్ డేట్ వస్తే సంబరపడిపోయే  అభిమానులు ఇప్పుడు వారం వారం అప్ డేట్స్  పోస్ట్ చేస్తాము అని చిత్రబృందం తెలపడంతో మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: