టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా అలవైకుంఠపురములో, ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకుంది. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. నవదీప్, రాహుల్ రామకృష్ణ, సునీల్, అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, మురళి శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కలగలిపి తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. 

 

గతంలో బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయం సాధించడంతో మూడవ సినిమాగా రాబోతున్న ఈ అలవైకుంఠపురములో కూడా మంచి హిట్ కొట్టి తీరుతుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుండి ఎస్ ఎస్ థమన్ స్వరపరిచిన మూడు సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతల నుండి విశేషమైన స్పందనను రాబట్టడం జరిగింది. ఇక ఇటీవల అందులో సామజవరగమనా సాంగ్ 1 మిలియన్ లైక్స్ దక్కించుకుని తెలుగు సినిమా సాంగ్స్ లో కొత్త రికార్డు సొంతం చేసుకోగా, 

 

నేడు మరొక సాంగ్ అయిన రాములో రాములా సాంగ్ 700k లైక్స్ దక్కించుకుని, దాని తరువాత అత్యధిక లైక్స్ పొందిన రెండవ సాంగ్ గా రికార్డు ని సొతం చేసుకుంది. ఈ విధంగా బన్నీ అలవైకుంఠపురములో సినిమాలోని రెండు సాంగ్స్ కూడా యూట్యూబ్ లో అద్బుతమైన రికార్డులు సొంతం చేసుకోవడంతో సినిమా యూనిట్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్....!!

మరింత సమాచారం తెలుసుకోండి: