టాలీవుడ్ చుల్ బులి సమంత అక్కినేని ప్రస్తుతం శర్వానంద్ సరసన తమిళ 96 మూవీ రీమేక్ లో నటిస్తున్నారు. ఇక ఇటీవల పెళ్లి తరువాత తన భర్త నాగ చైతన్యతో కలిసి మజిలీ సినిమాలో నటించి మెప్పించిన సమంత, కొద్దిరోజుల క్రితం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తెలుగుతో పాటు మరోవైపు తమిళ్ లో కూడా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్న సమంత అతి త్వరలో వెబ్ సిరీస్ లో అడుగుపెట్టబోతుననట్లు కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. 

 

అయితే నిన్నటి వరకు ఈ విషయమై ఆమె నుండి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇకపోతే నేడు ఆమె ఒక కార్యక్రమంలో భాగంగా అతి త్వరలో తాను వెబ్ సిరీస్ లో అడుగుపెట్టబోతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఏ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు అనేది మాత్రం సమంత కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి నేడు అందుంటున్న సమాచారం ప్రకారం, ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో మనోజ్ బాజ్ పాయి మరియు ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కి పలు భాషల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ సాధించిన, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 2 లో సమంత నటించబోతున్నట్లు చెప్తున్నారు. 

 

ఇప్పటికే ఆ వెబ్ సిరీస్ దర్శక నిర్మాతలు సమంతను కలిసి కథ వినిపించడం జరిగిందని, అయితే కథ తనను ఎంతో ఎగ్జైట్ చేయడంతో సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అన్ని కుదిరితే ఈ ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్ ని జనవరి మొదటి వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్ళబోతున్నట్లు టాక్. కాగా ఈ విషయమై మరికొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సమంత వంటి పెద్ద హీరోయిన్ తొలిసారి ఈ విధంగా వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువవ్వడం ఆహ్వానించదగ్గ విషయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: