తాను రాష్ట్ర రాజకీయాలపై సినిమా చేస్తున్నట్లు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా అనేకానేక అడ్డంకులను ఎదుర్కుంటూ వస్తోంది. మనకు రాంగోపాల్ వర్మ సంగతి తెలిసిందే. అతని ఎన్నో సినిమాలు సెట్ మీదకు వచ్చి ఆగిపోయినా.... ఈ సినిమాను మాత్రం చాలా పట్టుదలతో పూర్తి చేసి రేపు విడుదలకు సిద్ధం చేశారు. అయితే అచ్చం మన రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ నాయకులను పోలింగ్ క్యారెక్టర్లను దింపేసి పలువురి ప్రశంసలు అందుకున్న రాంగోపాల్ వర్మ కు అసలు సిసలు పరీక్ష ఇప్పుడే ఎదురయింది.

 

నిన్ననే తన సినిమా టైటిల్ ను 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' నుంచి 'అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు' గా మార్చిన రామ్ గోపాల్ వర్మ ఇంక అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న సమయంలో హై కోర్టు ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరికొద్ది గంటల్లో రిలీజ్ పెట్టుకొని ఇంకా సెన్సార్ బోర్డ్ నుండి సర్టిఫికెట్ రాని నేపథ్యంలో హైకోర్టు ఇప్పటివరకు ఈ చిత్రంపై ఉన్న అభ్యంతరాలు అన్నింటిని పరిగణలోకి తీసుకొని సినిమా కట్ చేయాల్సిందిగా బోర్డుకు తీవ్రమైన ఆదేశాలు జారీ చేసింది.

 

ఇకపోతే కులాల మధ్య చిచ్చుపెట్తే టైటిల్ ని మార్చాల్సి ఉందని హైకోర్టు ఆదేశించిన తర్వాత రామ్ గోపాల్ వర్మ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఆ టైటిల్ ను విన్నూత్తంగా మార్చడం మరియు రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ అతను రిలీజ్ చేస్తుంటే ఊరికే థియేటర్ లో కూర్చొని పాప్ కార్న్ తింటూ ప్రేక్షకులతో పాటు సినిమా చూస్తారు అనుకోవడం అమాయకత్వం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ బోర్డు సీరియస్ గా తీసుకుంటే వర్మ ఏ విధంగా తన చిత్రాన్ని రిలీజ్ చేసుకుంటాడో చూడాలి. తనకు న్యాయస్థానం గురించి మరియు 'లా' లో ఉండే లూప్ హోల్స్ బాగా తెలుసు అని చెప్పుకునే వర్మ ఇప్పుడు తన విజ్ఞానాన్ని ప్రదర్శించాల్సిన వేళయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: