ఇటీవ‌ల సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఏడుచేప‌ల క‌థ లో టెంప్ట్ రవి గా దూసుకుపోయిన అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా జంట‌గా, ఏడు చేప‌ల క‌థ చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన జి.చ‌రితా రెడ్డి నిర్మాతగా ల‌క్ష్మి చ‌రిత ఆర్ట్స్  మ‌రియు జిఎస్ఎస్‌పికె స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో రేష్మి హీరోయిన్ గా అంతం అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జి.ఎస్‌.ఎస్‌.పి.క‌ళ్యాణ్ ద‌ర్శ‌కుడిగా నిర్మిస్తున్న చిత్రం వైఫ్. ఈ చిత్రానికి నైఫ్ బెట‌ర్ దెన్ వైఫ్ అనే క్యాప్ష‌న్ ని పెట్టారు.. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాన్సెప్ట్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. డైరెక్టర్ వీరభద్రం చౌదరి, నిర్మాత సురేష్ కొండేటి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.  

 

మా ఈసీ మెంబర్ సురేష్ కొండేటి మాట్లాడుతూ.... ఈ సినిమాను లేడీ ప్రొడ్యూసర్ నిర్మించారు కాబట్టి మంచి మెసేజ్ ఉంటుందని అనుకుంటున్న. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.  అని అన్నారు. 

 

దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ... వీరు తీసిన ఏడు చేపల కథ కు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా హీరో అభిషేక్ కి మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. హీరో అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. ఈ సినిమాతో నిర్మాత సుచరిత సక్సెస్ కావాలని కోరుకుంటున్న. అని అన్నారు. 

 

హీరో అభిషేక్ మాట్లాడుతూ.... ఏడు చేపల కథకు 4 కోట్ల గ్రాస్ వచ్చింది. నటుడిగా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అన్ని వర్గాల్ని మెప్పించలేదు. కానీ ఈ సినిమా నిరాశ పర్చదు. మా దర్శకుడి వన్ మ్యాన్ షో. ఏలూరు సీను డైరెక్టర్ ని నాకు  పరిచయం చేశాడు. వైఫై సినిమాకు నిర్మాతలు సుచరరిత గారు, లక్ష్మి రెడ్డి గారు బాగా సపోర్ట్ చేశారు. నామీద నమ్మకంతో నిర్మాతలు డబ్బు పెట్టారు. అందరూ నవ్వాలనే కసిగా చేశాం. ప్రతీ సీన్ నవ్వించే ప్రయత్నం చేసాం. ఎవ్వరూ నిరాశ పడరు. అని అన్నారు. 

 

ద‌ర్శ‌కుడు జి.ఎస్‌.ఎస్‌.పి క‌ళ్యాణ్ మాట్లాడుతూ... 2015 లో అంతం సినిమా చేసాను. చాలా గ్యాప్ తో వైఫై సినిమా తీసాను. వైఫై సినిమా నిర్మాత సుచరిత గారు బాగా సపోర్ట్ చేశారు. ఏడు చేపల కథ నిరాశ పరిచింది. కానీ ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా అధ్యతం నవ్వుకుంటారు. టైం కూడా తెలీకుండా సినిమా ఎంజాయ్ చేస్తారు. తక్కువ టైం లో తీసాం. ఎక్కువ కష్టపడి చేసాం. నా టీమ్ చాలా సపోర్ట్ చేసింది. అని అన్నారు. 

 

నిర్మాతలు మాట్లాడుతూ.... ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది. డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ నాకు ఈ క‌థ చెప్పిన‌ప్ప‌డు వెంట‌నే ఒకే చేశాను., ఎందుకంటే ఇలాంటి క‌థ‌లు ఈ జెన‌రేష‌న్ లో రావాలి.. అంద‌రూ త‌ప్ప‌కుండా చూడాలి..  అభిషేక్ రెడ్డి, సాక్షి ఈ క‌థ కి చాలా చ‌క్క‌గా సెట్ అయ్యారు. అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: