ప్రస్తుతం నటులందరూ కొత్త పుంతలు తొక్కుతున్నారు . సినిమాలు చేయడమే కాదు అటు వెబ్ సిరీస్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా... సినిమాల  ద్వారా ఎంత ఇమేజ్  సంపాదించిన...వెబ్ సిరీస్ లలో  నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు నటులు. కమర్షియల్ సినిమాలు చేయడం కంటే వెబ్ సిరీస్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోయిన్లు హీరోలు సైతం వెబ్ సిరీస్ లో నటించి అలరించారు. ప్రేక్షకులు కూడా వెబ్ సిరీస్ లను ఎక్కువగా ఆదరిస్తు  ఉండడంతో వెబ్  సిరీస్ లు రోజు  రోజుకు  పాపులర్ అయిపోతున్నాయి. ఇప్పుడు కమర్షియల్ సినిమాలకు ఎంత డిమాండ్ ఉందొ...  అటు వెబ్ సిరీస్ లకు కూడా అంతే డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ నటులందరూ వెబ్ సిరీస్ వైపు నడుస్తున్నారు. 

 

 

 

 ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అక్కినేని వారి  కోడలు సమంత చాలా రోజుల నుండి అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు అంటూ  గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై సమంత క్లారిటీ వచ్చేసింది. సోషల్ మీడియా వేదికగా సమంత వెబ్ సిరీస్ తో నటిస్తుండడం అనే విషయంలో క్లారిటీ ఇచ్చింది. డైరెక్టర్ రాజ్ నిడిమోరు  ఇంస్టాగ్రామ్ లో స్వాగతం పలుకగా... దాన్ని సపోర్ట్ చేసిన అక్కినేని వారి కోడలు సమంత అమెజాన్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలి మ్యాన్ లో  నటించబోతున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అందరు సంబరపడిపోతున్నారు. 

 

 

 

 సమంత ఈ విషయాన్ని ప్రకటించగానే సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులు అందరూ వివిధ కామెంట్స్ రూపంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమయ్యే ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ బాగా పాపులారిటీ సంపాదించింది. ఫ్యామిలీ మాన్ ఫస్ట్ సీజన్ లో మనోజ్ బాజ్పాయ్ ప్రియమణి సందీప్ కిషన్ లు  ప్రధాన పాత్రలో నటించగా... ఇప్పుడు రెండో సీజన్ లో సమంత మరో ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు  సమాచారం. కాగా ఈ వెబ్ సిరీస్ కు దర్శకులు రాజ్ నిడిమోరు కృష్ణా డికేలు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ దర్శకులు వరుణ్ సందేశ్ సందీప్ కిషన్ హీరోలుగా వచ్చిన డి  ఫర్ దోపిడి సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: