మామా ఎక్ పెగ్ లా.. అరె మామా ఎక్ పెగ్ లా... అంటూ ఆ మద్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్’ మూవీలో దుమ్మురేపారు నందమూరి బాలకృష్ణ.  నంద‌మూరి బాల‌కృష్ణ ఐదుప‌దుల వ‌య‌స్సులోను చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పటికీ కుర్ర హీరోలకు సవాల్ విసురుతూ వరుసగా సినిమాలు తీస్తున్న బాలయ్య ఈ ఏడాది తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ జీవితక కథ ఆధారంగా ‘ఎన్టీఆర్ బయోపిక్’ సినిమాలో నటించారు.  ఈ మూవీకి క్రిష్ దర్శకత్వం వహించారు.  మొదటి నుంచి ఈ మూవీ రక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చింది. 

 

 మొత్తానికి థియేటర్లలో రిలీజ్ అయ్యింది...కానీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీ తర్వాత ఏపీలో ఎన్నికలు రావడం... బాలకృష్ణ హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా రెండో సారి గెలవడం అయ్యింది.  దాంతో దాదాపు ఆరు నెలల  గ్యాప్ తీసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం ‘రూరల్’ సినిమాలో నటిస్తున్నారు.  ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఇటీవల సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించాయి. రూల‌ర్ సినిమా కోసం స్లిమ్ అయిన బాల‌య్య డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

సాధారణంగా బాలకృష్ణ ఏదైనా వేడుకలో పాల్గొంటే చాలా ఉత్సాహంగా కనిపిస్తుంటారు..అక్కడ ఆడీ పాడీ సందడి చేస్తుంటారు.   తాజాగా ఓ ప్రైవేట్ వేడుక‌లో త‌మిళ చిత్రం వేదాళంలోని అలుమా డోలుమా అనే మాస్ సాంగ్‌కి స్టెప్స్ వేశారు. బాల‌య్య స్టెప్పుల‌కి అక్క‌డున్నవారంతా ఈల‌లు వేస్తూ గోల చేశారు. 

 

ప్ర‌స్తుతం బాల‌య్య డ్యాన్స్కి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇక బాలకృష్ణ అక్కడ తీన్మార్ స్టెప్పులు..వెరైటీ డ్యాన్స్ చేస్తూంటే నిజంగా బాలయ్య నీకు నీవే సాటయ్య అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఎస్ రవి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య చేస్తున్న రూల‌ర్ అభిమానుల‌కి మంచి వినోదం అందించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. త్వ‌ర‌లో బోయ‌పాటితో చేయ‌నున్న ప్రాజెక్ట్ మొద‌లు పెట్ట‌నున్నారు బాల‌కృష్ణ‌.

మరింత సమాచారం తెలుసుకోండి: