అల్లు అర్జున త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న "అల వైకుంఠపురములో" సినిమాకి చాలా బజ్ ఏర్పడింది. ఈ సినిమా మీద ప్రేక్షకులకి చాలా అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులలు బాగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలకు ధీటుగా అల వైకుంఠపురములో ఉండనుందని ఇప్పటికే విడుదలైన మూడు పాటల ద్వారా అర్థం అవుతుంది.

 

థమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుండి ఇప్పటికే మూడు పాటలు విడుదల అయ్యాయి. మొదటి పాటగా సామజవరగమనా విడుదలై సినిమా మీద  అంచనాలన్నింటినీ ఒక్కసారిగా పెంచింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ట్రెండింగ్ లో నిలిచింది. ఈ పాట ఇప్పటి వరకు తొంభై మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడమే కాకుండా పది లక్షల లైక్స్ సాధించిన మొదటి తెలుగు పాటగా గుర్తింపు పొందింది.

 

ఈ పాట ద్వారా సినిమాకి రావాల్సిన ప్రమోషన్ వచ్చేసింది. ఈ పాట ద్వారా ఒక్కసారిగా అందరి అటెన్షన్ ఈ సినిమా మీదకి మళ్ళింది. ఆ అటెన్షన్ ని తమ మీదే ఉంచుకోవడానికా అన్నట్టు మరో పాటని విడుదల చేశారు. ఈ సారి మంచి ఫోక్ సాంగ్ తో వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. రాములో రాములా అంటూ సాగే ఈ పాట సరికొత్త చరిత్ర సృష్టించింది.  సామజవరగమనా పాట తర్వాత ఎక్కువ ల్లైక్స్ వచ్చిన పాటగా గుర్తింపు తెచ్చుకుంది.

 

ఏడు లక్షలకి పైగా లైక్స్ సాధించి ఎక్కువ లైక్స్ సాధించిన రెండవ తెలుగు పాటగా రాములో రాములా గుర్తింపు పొందింది. ఈ రెండు పాటల ద్వారా అల వైకుంఠపురములో సినిమాకి జాతీయ స్థాయిలో ప్రమోషన్ వచ్చింది. మరి మిగతా పాటలు కూడా ఇదే కోవలోకి పోతాయేమో చూడాలి. మరి ఈ బజ్ సినిమా కలెక్షన్లకి ఎంత వరకు సాయపడుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: