నందమూరి బాలకృష్ణ మరోసారి సోషల్ మీడియాని షేక్ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తన స్టెప్పులతో లైవ్ పెర్ఫెమెన్స్ చేసి విజిల్స్ వేయించారు. ఇటీవల ఒక ఈవెంట్ కి వెళ్లిన బాలయ్య అక్కడ అతిధుల కేరింతల మద్య తన స్టైలిష్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు.ఇదిలా ఉంటే , బాలకృష్ణ రూలర్ సినిమా కోసం చేస్తున్న స్టెప్స్ కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి.  బాలయ్య డ్యాన్స్ తో అదరగొడుతున్నాడు.

 

 సింపుల్ గా ఉండే స్టెప్పులను బాలయ్య చకచకా చేస్తూ వావ్ అనిపిస్తున్నాడు.  ఈ స్టెప్స్ తో ఉన్న చిన్న వీడియో ట్విట్టర్ లో పోస్ట్ కాగా క్షణాల్లో ఆ వీడియో వైరల్ అయ్యింది.ముందుగా అజిత్ సినిమాలోని ఒక మాస్ సాంగ్ కి స్టెప్పులేసిన బాలయ్య బాబు అనంతరం పైసా వసూల్ సినిమాలోని "మామ ఏక్ పెగ్ లా" అనే సాంగ్ కి చిందులేశారు. సాధారణంగా బాలయ్య బాబు డ్యాన్స్ చేయడంలో దిట్ట అని అందరికి తెలిసిన విషయమే.

 

కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా డ్యాన్సులు చేస్తూ సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు.ఇక బాలయ్య హీరోగా చేస్తున్న రూలర్ సినిమా డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఆ సినిమాలోని బాలయ్య గెటప్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.

 

 ఈ సినిమా కోసం బాలకృష్ణ వెయిట్ తగ్గిపోయారు.  కొత్తగా కనిపిస్తున్నారు. ఫ్రెంచ్ గడ్డంతో యువకుడిలా మారిపోయారు. ఆయన కొత్తలుక్ మాస్ క్లాస్ అభిమానులకు అందరికి నచ్చింది. 105 సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా లో సోనాల్ చౌహన్ హిరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటవరకూ ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా కు బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ సినిమాకు ఈ మాత్రం కలెక్షన్స్ తీసుకొస్తాయో చూడాలి..త్వరలోనే సినిమా విడుదల కానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: