నిఖిల్‌, లావణ్య త్రిపాఠిలు హీరో హీరోయిన్లుగా థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న సినిమా అర్జున్‌ సురవరం. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా నిఖిల్‌ మీడియాతో మాట్లాడాడు.

 

అర్జున్ సురవరం మూవీ విడుదల ఇంత ఆలస్యం కావడానికి కారణం?
మే 1న విడుదల కావాల్సిన మూవీ ఇన్ని నెలల తరువాత థియేటర్స్ లోకి వస్తుంది. సినిమా విడుదల ఎప్పుడవుతుందా అనే బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నిర్మాతలకు దియేటర్స్ ఓనర్స్ కి మధ్య ఉండే వారు మా సినిమాని వాడేసుకున్నారు. ఈ విషయంలో నేను, నిర్మాతలు ఏమి చేయలేకపోయాం. అవన్నీ సాల్వ్ చేసుకుంటూ వచ్చే సరికి ఈ సమయం పట్టింది. ఈ సినిమా విడుద‌ల కోసం ఒక్కో నేను చాలా సార్లు ఏడ్చాను కూడా. ఎన్నోసార్లు నిద్ర‌పోకుండా ఆలోచించేవాడ్ని ఎందుకంటే నా గ‌త సినిమాలు ఏవీ కూడా విడుద‌ల‌వ్వ‌కుండా ఇంత చేదు అనుభ‌వాన్ని ఇవ్వ‌లేదు.


 
అర్జున్ సురవరం మూవీ దేని గురించి?
లావణ్య, వెన్నెల కిషోర్, సత్య, నేను ఒక యంగ్ టీమ్. ఈ నలుగురు టీమ్ సభ్యులు ఒక సమస్యలో పడాతారు, ఆ సమస్య నుండి వాళ్లు ఎలా బయటపడగలిగారు అనేది ముఖ్య కథ. అలాగే మంచి సోషల్ మెస్సేజ్ ఉన్న చిత్రం ఇది. కొందరి చర్యల వలన గ్రాడ్యుయేట్స్ , వారిపై ఆధారపడ్డ తలిదండ్రులు ఎలా సఫర్ అవుతున్నారు అనే విషయాలు చెప్పడం జరిగింది.


 
ఈ మధ్య కెరీర్ పరంగా వెనుకబడ్డాను అనుకుంటున్నారా?
ప్రతి రోజు నేను పది నుండి పదిహేను స్క్రిప్ట్స్ వింటూ ఉంటాను. అలాగని ప్రతి సినిమా చేసుకుంటూ వెళ్ళలేను. హ్యాపీ డేస్ మూవీ చేసే ముందే మా అమ్మగారు… నీ సినిమా కుటుంబం మొత్తం కూర్చొని చూసేదిలా ఉండాలి అన్నారు. అందుకే సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటున్నాను.


 
ఇది తమిళ చిత్రానికి రీమేక్ కదా, మరి ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు ఏమైనా చేశారా?
మెయిన్ ప్లాట్ మార్చకుండా కొన్ని మార్పులు చేశాం. లావణ్య ,వెన్నెల కిషోర్, సత్య పాత్రలను మరింత స్ట్రాంగ్ గా నా పాత్రకు సమానంగా పెంచడం జరిగింది.

 

ముద్ర అనే టైటిల్ ఎందుకు మార్చారు?
మేము టైటిల్ ప్రకటించిన తరువాత బుక్ మై షోలో చూస్తే అదే పేరుతో మరో చిత్రం ఉందని తెలిసింది. ఇక అప్పుడు నేనే టైటిల్ మార్చమని సూచించాను.


 
అర్జున్ సురవరం అని పెట్టడానికి కారణం?
ఈ మూవీలో హీరో పేరు అర్జున్. ఇక సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రముఖ జర్నలిస్ట్. ఆయన స్పూర్తితో సురవరం అనే సర్ నేమ్ తీసుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: