అమెరికాలో కొంత మంది సెలబ్రిటీస్ చాలా ఓపెన్ గా ఉంటారు.. ఎంత ఓపెన్ గా అంటే పక్కవారికి ఇబ్బంది కలిగేంత ఓపెన్ గా ఉంటారు. అలాంటి సెలబ్రిటీ గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఆమె ఒక ప్రముఖ అమెరికన్ సింగర్ పేరు, కామిల్లా కాబెల్లో. ఈ 22 ఏళ్ల సింగర్ "హవానా, ఓహ్ నా-నా (అయ్)
హాఫ్ అఫ్ మై హార్ట్ ఇస్ ఇన్ హవానా",
అనే పాట పాడి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. భారతదేశ ప్రజలు అత్యధికంగా చూసిన ఆంగ్ల పాటలలో 'హవానా' ఒకటి. అయితే ఈ పాట పాడిన సింగర్ ఇంకొక ప్రముఖ కెనడియన్ సింగర్ 'షాన్ మెండెస్‌'తో ప్రేమలో ఉంది. గాఢమైన ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎక్కడికిపోయినా కలిసే వెళ్తారు. వెళ్తారు సరే ఎంతమంది పబ్లిక్ ఉన్నా, మీడియా ఉన్నా.. బహిరంగంగానే ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా కామిల్లా కాబెల్లో ఒక షోలో పాల్గొంది. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన వారందరితో మాట్లాడుతూ ఉంది. అయితే ఒక అతను లేచి.. 'ఈమధ్య పబ్లిక్ ప్రదేశాల్లో ముద్దులు ఎక్కువైపోతున్నాయి.' అని అన్నాడు. దీంతో ఈ ప్రముఖ సింగర్ కొంచం కోపగించి ఇలా మాట్లాడింది. 'నువ్వు చేసిన వ్యాఖ్యలు వింటుంటే నువ్వు నన్నే ఉద్దెశించి మాట్లాడినవని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం ఇలాంటి రొమాంటిక్ ఫొటోలన్నీ సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలంటారా? అయితే శృంగారం కూడా ఇంస్టాగ్రామ్ లో చేయాల్సి వస్తుంది’ అని అనేసింది.


చాలా సందర్బాలలో కామిల్లా కాబెల్లో..తన ప్రియుడు షాన్ మెండెస్‌ను పబ్లిక్ లో ముద్దుపెట్టుకుంది...అలా ఎందుకు చేసిందో కూడా ఆమె వివరణ ఇచ్చింది. 'నేను చేసే ప్రతి పనిని ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. అలా చేయడం వలన నా పబ్లిక్ సున్నితత్వము పూర్తిగా పోయింది..ఇంకా నేను పబ్లిక్ లో ఉన్నపటికీ నాకు మొహమాటం లాంటి ఫీలింగ్స్ రావట్లేదు." అని చెప్పింది. 

కామిల్లా, షాన్

మరింత సమాచారం తెలుసుకోండి: