ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అను మాలిక్ పై గత సంవత్సర కాలంగా తనను సెక్సువల్ గా హెరాస్ చేసాడని ఆరోపణలు చేస్తున్న సింగర్ సోనా మొహాపాత్ర మరోసారి మీడియా ముందుకు వచ్చి ఫైర్ అయింది. అను మాలిక్ పై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ఆయనపై ఆరోపణలతో దాడి చేస్తున్న సోనా ఈసారి ఆయన జడ్జ్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఆ షో ప్రసారం అవుతున్న ఛానల్ పై తీవ్రంగా విమర్శలు చేసింది. ఇటీవల ఆ షోలో ఒక జడ్జ్ గా వ్యవహరిస్తున్న నేహా కక్కర్ పై కంటెస్టెంట్ ఒకతను స్టేజ్ పైనే బలవంతంగా ముద్దు పెట్టాడు. నడుం పట్టుకుని బలంగా లాగి ముద్దు పెట్టిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేహా కక్కర్ ఈ విషయాన్ని లైట్ తీసుకుంది. 

 

అభిమానంతో అతడు అలా చేశాడంటూ ఊరుకుంది. కాని ఆ మధ్య తనూశ్రీ దత్తా అతడిపై కేసు పెట్టాలంటూ నేహా కక్కర్ కు సూచించింది. ఇటీవల సోనా మొహాపాత్ర కూడా అతని తీరుపై విరుచుకు పడింది. అలాంటి వ్యక్తిపై కేసు పెట్టి అరెస్ట్ చేయించాలని వాపోయింది. అలాంటి వ్యక్తులను క్షమించడం వల్లే ప్రస్తుతం పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటూ నేహా ఆగ్రహం వ్యక్తం చేసింది. అతని మీద కేసు పెట్టకుండా ఛానెల్ ప్రమోషన్ కోసం.. షో టీఆర్పీ రేటింగ్ కోసం ఆ వీడియోను వాడుకున్నారని నేహా వెల్లడించింది. ఆ వీడియోను వైరల్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని.. ఇలాంటి పరిణామాలు అస్సలు మంచిది కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

 

అంతేకాదు మరోసారి అను మాలిక్ పై సోనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల అను మాలిక్ ఇండియన్ ఐడల్ షోకు బ్రేక్ తీసుకున్నాడు. తన ఆరోపణల వల్లే ఆయన బ్రేక్ తీసుకున్నాడని.. ఇది తన విజయం అంటూ సోనా చెప్పుకొచ్చింది. ఇక అనుమాలిక్ మనుషులు నాకు ఈ మధ్య ఫోన్ చేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని.. డబ్బులు కావాలంటే ఇస్తామంటూ బెదిరిస్తున్నారు. నాకు డబ్బులు అవసరంలేదు న్యాయం కావాలంటూ అనుమాలిక్ పై చట్టపరమైన చర్యలకు సిద్దం అవుతున్నట్లుగా తెలిపింది. ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలు ఎన్ని జరుగుతున్నా ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు మిన్నకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇలా మీటూ అంటూ అమ్మాయిలు ఎంతకాలం గొంతు చించుకొని అరుస్తారు..! ఇందుకు పరిష్కారమే లేదా..? 

మరింత సమాచారం తెలుసుకోండి: