గత కొన్ని రోజుల నుండి జబర్దస్త్ కామెడీ షో లో జరుగుతున్న గొవడలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే ఒక్కొక్కరుగా జబర్దస్త్ కామెడీ షో నుండి బయటకు వెళ్లిపోసారు. ఇక జడ్జ్‌గా వ్యవహరించిన నాగబాబు కూడా ఈ షో నుండి బయటకు వెళ్లిన తర్వాత జబర్దస్త్ లో ఉన్న లొసుగులను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నాడు. కాని అందులో వచ్చేవన్ని ఈ షోలో వచ్చే స్కిట్స్‌లానే ఉన్నాయి తప్పితే అసలు నిజాలు మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు..

 

 

ఇక తాను ఎందుకు జబర్దస్త్‌ను వీడాల్సి వచ్చిందన్నదానిపై క్లారిటీ ఇస్తూ ‘అంతా నా ఇష్టం’ అనే సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటికే రెండు వీడియోలను పోస్ట్ చేసిన నాగబాబు వాటికి కంటిన్యూగా మరో వీడియో విడుదల చేశారు. ఇక ఇప్పుడు తాజాగా చెప్పిన విషయం ఏంటంటే జబర్దస్త్ షోకి ప్రేక్షకుల నుండి  అనూహ్య స్పందన రావడంతో జబర్దస్త్ షో లాంటిది ఇంకొకటి చేద్దాం అని శ్యాంప్రసాద్ దగ్గర నుండి కబురు వచ్చింది ఈ చానల్ వారికి. అయితే జబర్దస్త్ షో డైరెక్టర్ సంజీవ్‌గారికి ఇలాంటి షోలు ఒకసారి చేస్తే చూస్తారు కాని.. మళ్లీ అదే చేస్తే చూస్తారా అనే సందేహం కలిగింది. మరోవైపు రోజాకి కూడా డైలమా ఉంది. రెండూ చూస్తారా అని. చివరికి జబర్దస్త్ టీం లీడర్స్ కూడా ఇదే సందేహం వ్యక్తం చేశారు.

 

 

ఆసమయంలో నేను అది మంచి థాట్ అని ఒకే ఒక లాజికల్ క్వచ్ఛన్‌తో ఆన్సర్ ఇచ్చా. అలా ఎక్స్ ట్రా జబర్దస్త్ వచ్చింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ ముందుకు వెళడానికి నిర్మాతలుగా శ్యాం, ఈటీవీ వాళ్లు ఎలా ఉన్నారో.. దాని మీద నమ్మకంతో పనిచేసిన వ్యక్తుల్లో నేనూ ఒకడ్ని అని తెలిపారు. ఇకపోతే జబర్దస్త్ గ్రాండ్ సక్సెస్ కావడంలో ముఖ్య భూమిక పోషించింది దర్శకుడు సంజీవ్. అతనితో పాటుగా నితిన్, భరత్‌లు కూడా చాలా కష్టపడ్డారు. అన్నింటికీ మించి జబర్దస్త్‌కి ప్రాణం పెట్టి చేసింది ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు.

 

 

రమేష్ అనే ఆర్ట్ డైరెక్టర్ అద్భుతమైన పని చేస్తాడు. సెట్ వేయాలంటే ఆఫ్ డేలోనే కంప్లీట్ చేసే టాలెంట్ ఉన్నవాడు రమేష్. ఇదే కాకుండా ఈ షోను నాతోపాటుగా మిగతా వాళ్లు ఇది శ్యాం ప్రసాద్ రెడ్డి షో, మల్లెమాల వారిది అని ఈటీవీ వాళ్లది అని ఎప్పుడూ వేరుగా చూడలేదు. జబర్దస్త్ అంటే. మన ప్రోగ్రామ్ అనే అనుకున్నాం. తప్పు జరిగినా ఒప్పు జరిగినా చర్చించుకునేవాళ్లు. కొన్ని సందర్భాల్లో కుర్రాళ్ల మధ్య విభేదాలు వచ్చేవి.. వాటిపై ఆఫ్ ది రికార్డ్ సెట్ చేసేవాడిని అని చెప్పుకొచ్చారు.

 

 

ఇక జబరస్త్ షో నుండి బయటకు వచ్చిన నాగబాబు.. తన యూట్యూబ్‌లో ఒక్కో వీడియోను విడుదల చేస్తున్నప్పటికీ అవి తన ఛానల్‌ను ప్రమోట్ చేసుకోవడానికే తప్ప.. ఆయన ఎందుకు బయటకు రావాల్సివచ్చింది.. అక్కడ జరిగిన పరిణామాలేంటి? అసలు అక్కడ ఏమైనా జరిగిందా? బయట ప్రచారం జరుగుతున్నట్టుగా విభేదాల కారణంగా ఆయన బయటకు వచ్చేశారా? అన్న వాటిపై స్పందించకుండా.. ఏవేవో సొల్లు కబుర్లు చెప్పుకొస్తున్నారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: