సినిమా ఇండస్ట్రీలో కి వచ్చాక చాలామంది హీరోయిన్స్ రక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అయితే ఈ రంగుల ప్రపంచంలో గొంగలి పురుగులుంటాయని చాలా మంది తెలుసుకోలేకపోవడం దురదృష్టకరం. ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే దర్శక, నిర్మాతలే కాదు, హీరోలు, ఇతర టెక్నీషియన్స్ పెట్టే శారీరక హింసలను భరించాలి. లేదంటే ఆ అమ్మాయిలకు అవకాశాలు రావు సరి కదా వాళ్ళ మీదే నిందలు మోపి బ్యాడ్ చేసేస్తారు కొందరు ప్రబుద్ధులు. అలాంటి పరిస్థితినే ఎదురుకొంది ఒక బాలీవుడ్ హీరోయిన్. ఫలితంగా డ్రగ్స్ కి బానిసైంది. బాలీవుడ్ సినిమా 'ఏబీసీడీ' తో డాన్సర్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది లారేన్ గోట్లీబ్. అమెరికాకు చెందిన ఈ బ్యూటి ఒక్క సినిమాతోనే మంచి పేరు వచ్చింది. 

 

అయితే కొన్ని కారణాల వల్ల లారేన్ సినిమాల్లో ఎక్కువగా నటించలేక పోయింది. చెప్పుకోలేని కష్టాలు కొన్ని వచ్చి లారేన్ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. ఆ ఇబ్బందులు కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. మద్యం.. డ్రగ్స్ కు బానిసైన లారేన్ చాలా కాలం గ్యాప్ తర్వాత ఒక మీడియా ముందుకు వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో లారేన్ గోట్లీబ్ చెప్పిన షాకింగ్ విషయాలు అందరిని ఆశ్చర్య పరచాయి. రెండు సంవత్సరాల పాటు నరకం అనుభవించాను. ఏబీసీడీ సినిమా సమయంలో నాకు చాలా మంచి పేరు వచ్చింది. కానీ వాళ్ళు చెప్పినవన్నీ చేయలేదని ఆ సినిమాలో నేను నటించిన సీన్స్ ను తొలగించడంతో పాటు నన్ను ప్రమోషన్స్ కు దూరంగా ఉంచారు. మళ్ళీ సినిమా రాకుండా చేశారు. దాంతో పాటు నేను అందరిని నమ్మాను. 

 

కాని నన్ను చాలా మంది మోసం చేశారని తన గోడును వెల్లబోసింది. గతంలో నేను ఇండియా నుండి అమెరికాకు వెళ్లే సమయంలో కన్నీళ్లు పెట్టుకునేదాన్నంటూ చెప్పుకొచ్చింది. నేను ఎంత నిజాయితీగా ఉన్నా చాలా మంది నాతో అబద్దాలు చెప్పారు. చాలా మంది చేతిలో మోసపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో నాకు మద్యం, డ్రగ్స్ మంచి ఔషదాలుగా పని చేశాయి. ఆ రెండేళ్ల పాటు జీవితం మొత్తం నాశనం అయ్యిందనిపించింది. మళ్లీ ఇప్పుడిప్పుడే ఆ డిప్రెషన్ నుండి బయటకు వస్తున్నానంటూ లారేన్ చెప్పుకొచ్చింది. అయితే తను ఇలా నరకం అనుభవించడానికి కారణమైన వాళ్ళని మాత్రం బయట పెట్టలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: