సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం పుణ్యమా అని ఎందరో హీరోయిన్లు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటపెట్టగలిగారు. తీగ లాగితే డొంక కదిలినట్లు రోజుకో కొత్త భాగోతం బయటికి వస్తోంది. తాజాగా ప్రముఖ నటి మంజరి ఫడ్నిస్ తాను ఎదుర్కొన్న ఇబ్బందికర సంఘటన గురించి మీడియాతో పంచుకున్నారు.

 

 

అదేమంటే నేను గత 15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. ఇంతకాలంగా ఈ రంగంలో ఉన్నప్పటికి నేను చేసిన సినిమాల కంటే పోగొట్టుకున్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు కారణం ఏ డైరెక్టర్‌కో ప్రొడ్యూసర్‌కో లొంగకపోవడం. వాళ్లు అడిగిన దానికి ఒప్పుకోలేదని నన్ను సినిమాల నుంచి తొలగించేసేవారు. అంతేకాదు వారి వల్ల భారీ కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు కూడా పోగొట్టకోవాల్సి వచ్చింది. దానివల్ల తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాల్లో మాత్రమే నటించేదాన్ని. కానీ అవి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యేవి.

 

 

ఈ ఘటనల వల్ల చాలా కాలంగా డిప్రెషన్‌లో ఉండిపోయాను. ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు చిత్ర పరిశ్రమలో చాలా ఎక్కువ. నా ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోలేక ఎందరో పెద్ద నిర్మాతల సినిమాలకు ఆ విషయంలో నో చెప్పాను. కొన్నిసార్లు సినిమాలకు సంతకం చేసేశాక కూడా కోరికలు తీర్చమని అడిగేవారు.. వారి మాటలకు సమాధానంగా నేను తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చేసి సినిమాల నుంచి తప్పుకునేదాన్ని.  ఓసారి దక్షిణాది నిర్మాత నుంచి నాకు పిలుపు వచ్చింది. భారీ బడ్జెట్ సినిమాలో నాకు అవకాశం ఇస్తానన్నాడు. కానీ దాని వల్ల నాకు లాభమేంటి అని అడిగాడు.

 

 

నేను బాగా కష్టపడి నటిస్తానని చెప్పాను. కానీ ఆ విషయం నాకు అనవసరం అన్నాడు. అప్పుడు అర్థమైంది మనసులో నాపై ఉన్న కోరికతో నన్ను పిలిపించాడని. ఇక ఇప్పటికే అవకాశాల కోసం సెక్స్‌కి ఒప్పుకునే అమ్మాయిని కాదని అందరు నిర్మాతలకు తెలిసి ఉంటుంది.  ఇకపోతే హీరోయిన్లు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మీడియా ముందు మాట్లాడితే అన్ని నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు తగ్గిపోతాయి.  అందువల్ల చాలా మంది నోరు విప్పడానికి భయపడతారు అని తెలిపారు మంజరి.

మరింత సమాచారం తెలుసుకోండి: