ప్రతి శుక్రవారం సినీ ప్రేమికులు ఆశగా థియటర్స్ వైపే చూస్తుంటారు. శుక్రవారం వచ్చిందంటే  సినిమాల సందడి మూములుగా ఉండదు. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమౌతాయి.

 

నవంబర్ నెలాఖరున తెలుగుతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులని పలకరించేందుకు సిద్దమయ్యాయి. కొత్త ఏడాది లో పెద్ద సినిమాలు తల పడుతుండటం తో చిన్నసినిమాలను ముందే విడుదల చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు.  

 

ఈ నేపథ్యంలో నిఖిల్‌, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో సంతోష్ తెరకెక్కించిన అర్జున్ సురవరం చిత్రం  గ్రాండ్‌గా విడుదల కానుంది. దాంతో పాటుగా కిరణ్‌, రహస్య ప్రధాన పాత్రలలో రవికిరణ్ కోలా తెరకెక్కించిన రాజా వారు రాణిగారు అనే సినిమా కూడా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది.

 

ఇక తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన రఘుపతి వెంకయ్య నాయుడు చిత్రం కూడా నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ నరేష్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మణికర్ణిక జీవిత నేపథ్యంలో తెరకెక్కిన వారియర్ క్వీన్ ఆఫ్ జాన్సీ అనే ఇంగ్లీష్ చిత్రం, యమలోకం.. ఇంద్రలోకంలో సుందర వదన, రణ స్థలం, కమాండో 3 అనే హిందీ చిత్రం రేపు థియేటర్‌లోకి రానున్నాయి. మరి ఇన్ని సినిమాల్లో ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టు కుంటుందో చూడాలి.

 

ఈ మధ్య చిన్న సినిమాలు అని పెద్ద సినిమాలు అని తేడా లేకుండా శుక్రవారం వస్తె చాలు సినిమాల సందడి మామూలుగా లేదనే చెప్పాలి.  నవంబర్ 29 విడుదలకు చాలా సినిమాలు ఉన్నాయి..దాదాపు 4 సినిమాలు థియేట్లలోకి రానున్నాయి... ఏ సినిమా హిట్ అవుతుందో ఈ సినిమా బోల్తా కొడుతుందో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: