యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా రూలర్ షూటింగ్ నేటితో పూర్తి అయింది. బాలకృష్ణ, ధర్మ అనే మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా భూమిక ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. సీనియర్ నటి జయసుధర్ మరొక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సికె ఎంటర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. ఇక ఈ సినిమా నుండి సంగీత దర్శకుడు చిరంతన్ భట్ స్వరపరిచిన తొలి సాంగ్ ని డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయబోతోందట సినిమా యూనిట్. మంచి మాస్ నెంబర్ ని మొదటగా రిలీజ్ చేస్తున్నారని, ఈ సాంగ్ తో బాలయ్య ఫ్యాన్స్ లో మంచి జోష్ రావడం ఖాయమని సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోందట. ఇప్పతికేవార ఎన్టీఆర్ కథానాయకుడు, 

 

ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఎంతో ఢీలా పడ్డ బాలకృష్ణ, ఎలాగైనా ఈ రూలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. గత ఏడాది కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన జైసింహా సినిమా మంచి సక్సెస్ సాధించడంతోనే మరొక్కసారి ఆయనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు బాలయ్య. మంచి మాస్ మరియు కమర్షియల్ హంగులతో తెరకెక్కుతోంది. మరి ఈసారి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని సాధిస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: