సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాట్రిక్ కొట్టే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. ‘భరత్ అనే నేను’ మరియు ‘మహర్షి’ లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొట్టడంతో అనిల్ రావిపూడి దర్శకత్వం లో ప్రస్తుతం సంక్రాంతి పండుగకు రిలీజ్ కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అదరగొట్టే రీతిలో ఉండాలని మహేష్ బాబు వెరైటీగా ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

 

ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలయి అదరగొట్టే రెస్పాన్స్ దక్కించుకోవడం తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కొత్త డైలాగ్ డెలివరీ టైపులో మహేష్ బాబు చెప్పటంతో ...సినిమాలో మహేష్ బాబు కచ్చితంగా కామెడీ తరహాలో అదరగొట్టే క్యారెక్టర్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. అయితే సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో మహేష్ కూడా ఉండటంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను కాస్త భిన్నంగా ప్లాన్ చేసినట్లు సమాచారం.

 

విషయంలోకి వెళితే సరిలేరు నీకెవ్వరు సినిమాకి సంబంధించి ప్రతి అప్డేట్ కాబోయే సోమవారం సినిమా విడుదల అయ్యే అంతవరకు ప్రతి సోమవారం పోస్టర్స్, పాటలు, వీడియోస్, మేకింగ్ వీడియోస్ ఇలా ఏదో ఓక్ అప్డేట్‌ను రిలీజ్ చేయటానికి మహేష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా సినిమాకి సంబంధించి సరికొత్త విధంగా అభిమానులను అలరించే విధంగా మహేష్ కూడా స్పెషల్ గా ఓ వినూత్న కార్యక్రమం స్వయంగా చేయటానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 వ తారీకున భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు సినిమా యూనిట్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: