టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ జోష్ మీదనుంది. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన అఫీషియల్ టీజర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందనను రాబట్టడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ఇక ఈ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో పలు రికార్డులు కూడా నమోదు చేసింది. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా మరొక నటి సంగీత మరియు కమెడియన్ బండ్ల గణేష్ కూడా కొంత గ్యాప్ తరువాత సినిమాల్లోకి వస్తన్నారు. 

 

ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో సంగీతది ఒకింత నెగటివ్ షేడ్ ఉన్న రోల్ అని సమాచారం. సినిమాలో మొదట పాజిటివ్ గా ఉండే ఆమె రోల్, చివరికి వచ్చే సరికి కొంత షాకింగ్ గా నెగటివ్ గా మారుతుందని అంటున్నారు. నిజానికి గతంలో శివపుత్రుడు, బహుమతి వంటి సినిమాల్లో ఒకింత వెరైటీ రోల్స్ లో నటించి మెప్పించిన సంగీత అయితేనే ఈ రోల్ లో ఎంతో డేరింగ్ గా నటించగలరని భావించి, దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెను ఎన్నుకున్నట్లు చెప్తున్నారు. 

 

కాగా నేడు ఈ వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అయితే ఈ వార్త పై మాత్రం పూర్తి నిజ నిజాలు తెలియాల్సి ఉంది. ఇక రాబోయే సోమవారం ఈ సినిమా నుండి తొలి సాంగ్ ని రిలీజ్ చేయబోతోంది సరిలేరు నీకెవ్వరు యూనిట్. మహేష్ మరియు రష్మికల పై చిత్రీకరించబడిన ఆ రొమాంటిక్ సాంగ్, సినిమా మొత్తానికి మంచి హైలైట్ అని అంటున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయబోతున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: