టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ఇటీవల ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓవర్ ఆల్ గా యావరేజ్ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ అత్యద్భుత నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. 

 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణంలో అత్యంత భర్తీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా విషయమై సీనియర్ నటుడు గిరిబాబు గారు ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పడం జరిగింది. మెగాస్టార్ తో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని, ఆయన ఎప్పుడూ ప్రక్కన ఉన్నవారి మంచిని కూడా కోరతారని అన్నారు. ఇకపోతే కొన్నాళ్ల క్రితం ఒక ఫంక్షన్ లో మెగాస్టార్ ని కలిసిన తనకు సైరా నరసింహారెడ్డి అనే స్వాతంత్రోద్యమ నేపధ్య సినిమాలో నటిస్తున్నట్లు ఆయన చెప్పారట. అయితే ఆ సినిమా ఎందుకు ఎంచుకున్నారు, 

 

దాని బదులు మరేదైనా సోషల్ సబ్జక్ట్ మూవీ చేయవచ్చును కదా అని గిరిబాబు అన్నారట. ఎందుకంటే, అటువంటి సినిమాలు మనం ఎంతో కష్టపడి తెరకెక్కించినప్పటికీ నేటి కాలమాన పరిస్థితుల్లో అవి నిలబడి ఆడే పరిస్థితులు చాలావరకు తక్కువని, కాగా మెగాస్టార్ సహా ఆ సినిమా యూనిట్ ఆశించిన రేంజ్ లో సైరా నరసింహారెడ్డి సక్సెస్ కాలేకపోయిందని గిరిబాబు తెలిపారు. వాస్తవానికి సైరా సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు బాగానే వసూళ్లు రాబట్టినప్పటికీ, నార్త్ సహా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలావరకు నష్టాలు తెచ్చిపెట్టిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కాగా ఈ సినిమా తరువాత తన తండ్రితో తీయబోయే తదుపరి 152వ సినిమా విషయమై రామ్ చరణ్ మరింత జాగ్రత్త వహిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్ ...!!!

మరింత సమాచారం తెలుసుకోండి: