సినిమారంగం అంటేనే ఒత్తిళ్లు, ఒడిదుడుకులతో సాగే ప్రయాణం ఈ ప్రయాణంలో పడేవారు పడుతుంటారు, పరిగెత్తే వారు పరుగెడుతూనే ఉంటారు. ఇదే కోవలో ఇప్పుడు నిఖిల్ చేరాడు. తాను నటించిన ‘అర్జున్‌ సురవరం’ చిత్రం కోసం పడరాని పాట్లూ పడి చివరికి సినిమాను పూర్తి చేసారు. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నాడు. ఇక నిఖిల్, ఇప్పటివరకూ 17 సినిమాల్లో నటించాడు. కాని సినిమా విడుదల విషయంలో ఎప్పుడూ ఇంతటి ఇబ్బందులు రాలేదని తెలిపాడు..

 

 

‘కార్తికేయ, స్వామిరారా’ సినిమాల విషయంలో కూడా విడుదలకు కాస్త ఆలస్యం అయింది.. కాని  ‘అర్జున్‌ సురవరం’ సినిమా విషయంలో పడ్ద టార్చర్ మామూలుగా లేదు. అసలు ఈ చిత్రం ఈ ఏడాది మే 1న విడుదల కావాల్సింది. కానీ, కొందరివల్ల విడుదల కాలేదు. అసలు ఈ సినిమా రిలీజ్‌ అవుతుందా? లేదా? అనే భయం వేసింది. ఇంటికెళ్లి ఏడ్చాను.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను’’ అన్నారు నిఖిల్‌.

 

 

ఇకపోతే మరో విషయం ఏంటంటే మా సినిమా బిజినెస్‌ బాగా జరిగింది. కానీ, నిర్మాతలకు, థియేటర్స్‌ ఓనర్స్‌కి మధ్య ఉండేవారు మా సినిమాని వాడేసుకున్నారు. ఈ విషయంలో నేను, నా నిర్మాతలు ఏమీ చేయలేకపోయాం. సమస్యలన్నీ పరిష్కరించేందుకు సమయం పట్టింది. అందుకే నేను కూడా నా పారితోషికంలో 50 శాతం మాత్రమే తీసుకున్నా. ఈ సినిమాకి లాభాలొస్తే నిర్మాతలే నాకు ఇస్తారు అని తెలిపారు.

 

 

ఇక ఈ చిత్రానికి ముందుగా   ‘ముద్ర’ అని టైటిల్‌ అనుకున్నారు. కానీ అదే టైటిల్‌తో వేరే సినిమా విడుదల అవుతోందని తెలిసి, టైటిల్ మార్చారు. కధ విషయానికి వస్తే ‘అర్జున్‌ సురవరం’లో నిజాయతీ కలిగిన అర్జున్‌ అనే జర్నలిస్ట్‌ పాత్రలో నిఖిల్ చేస్తుండగా, ఓ యంగ్‌ టీమ్‌. అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుని, దాన్ని ఎలా పరిష్కరించారన్నదే ఈ చిత్రకథ.  ఇక నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి. సంతోష్‌ దర్శకత్వంలో  తెరకెక్కిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా  ఈ రోజు విడుదలవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: