జ్యోతి లక్ష్మి సినిమా తర్వాత ఛార్మి సినిమాలకు పూర్తిగా దూరమైంది.. ఇక సినిమాలను నిర్మిస్తూ వస్తుంది.. అలాంటి ఛార్మి సినిమాలలోకి ఎంటర్ అయ్యి చాలా కాలం అయింది. కానీ ఇంకా ఈ అమ్మడు పెళ్లికి నోచుకోలేదు.. ఎవరిమీదైన మనసు పారేసు కుందా అని పలు అనుమానాలు కలిగాయి..

 

డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అయితే ఈ సినిమాలోని ‘సిలక సిలక’ పాటకు శ్రీకాంత్ అనే కుర్రాడు వేసిన డ్యాన్స్‌కి ఫిదా అయిపోయింది 

 


సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన చార్మి. రామ్‌లాగే అంతే ఎనర్జిటిక్‌గా పర్‌ఫెక్ట్‌గా డ్యాన్స్ చేసిన ఆ కుర్రాడి వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. ‘అమేజింగ్ మ్యాన్. ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. అక్కడ నేను కూడా ఉంటే బాగుండేది నీతో పాటు డ్యాన్స్ చేసేదాన్ని’ అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 


ఒక నెటిజన్ ఈ వీడియో ను షేర్ చేశారు..అయితే,చాలా కాలం తర్వాత పూరీ జగన్నాథ్‌కి, రామ్‌కి ఈ సినిమాతో మంచి సక్సెస్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.75 కోట్లు రాబట్టింది. మెమొరీ మార్పిడి అనే కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకున్న పూరీ.. హీరో డైలాగ్స్‌కు తెలంగాణ యాస‌ను జోడించి కుర్రకారులో జోష్ పెంచాడు. తన టేకింగ్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. అందుకు తగ్గట్టుగానే మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం రొమాంటిక్ సినిమాను నిర్మస్తున్నారు..ఈ సినిమా తర్వాత విజయ్ తో మరో సినిమాను నిర్మించనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: