నిఖిల్ హీరోగా తమిళంలో సూపర్ హిట్టైన మూవీ కణితన్ రీమేక్ గా వచ్చిన సినిమా అర్జున్ సురవరం. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు. మాత్రుక దర్శకుడు టి.ఎన్ సంతోష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఓవర్సీస్ లో ఆల్రెడీ ప్రీమియర్ షోస్ పడటంతో సినిమా టాక్ ఆల్రెడీ బయటకు వచ్చింది.  

 

యువ హీరోల్లో తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న నిఖి అర్జున్ సురవరంలో కూడా తన మార్క్ చూపిచాలని ట్రై చేశాడు. అయితే ఆల్రెడీ హిట్టైన సినిమా కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఫేక్ సర్టిఫికెట్ మాఫియా నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా అంతా స్క్రీన్ ప్లే బేస్డ్ గా నడుస్తుందని తెలుస్తుంది.

 

దర్శకుడు టి.ఎన్ సంతోష్ సినిమాను ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసేలా ప్రతిభ కనబరిచాడని తెలుస్తుంది. ఇక లావణ్య త్రిపాఠికి ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇస్తుందని అంటున్నారు. ఫస్ట్ టాక్ అయితే సినిమా ఆహో ఓహో అనేలా లేదు కాని నిఖిల్ కెరియర్ లో ఓ మంచి సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. సినిమాలో నిఖిల్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుందని అంటున్నారు.

 

తెలుగులో ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పించగా రాజ్ కుమార్ నిర్మించారు. రిలీజ్ విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ అర్జున్ సురవరం ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అసలు టాక్ ఏంటన్నది తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. రిలీజ్ వరకు ఎలాంటి బజ్ లేని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి రావడం మెగా ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి అర్జున్ సురవరం ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరించాడు అన్నది తెలుగు రాష్ట్రాల్లో మొదటి ఆట పడితేనే కాని తెలియదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: