'ఏమాయ చేశావే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన స‌మంత కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం సమంత తెలుగులో టాప్ హీరోయిన్‌ల‌లో ఒకరు. దీనికి తోడు ఇటీవల ఈ భామ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. 

 

తన భర్త నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా  ఈ యేడాది మొదట్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. ఆ తర్వాత సమంత ఓ కొరియన్ రీమేక్‌లో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో సమంత, శర్వానంద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

 

ఇక ఈ చిత్రం '96' తమిళ  రీమేక్ అయిన 'జాను' షూటింగును పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా వుంది. కాగా, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలని మొదట్లో అనుకున్నప్పటికీ, ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నట్టు తాజా సమాచారం. మ‌రి ఈ చిత్రం వారం ముందుగా రావ‌డానికి గ‌ల కార‌ణాలేంటి అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక మ‌రి రీమేక్‌ల హ‌వా న‌డుస్తున్న త‌రుణంలో స‌మంత‌కి ఇది కూడా మ‌రో హిట్ అవుతుందేమో వేచి చూడాలి.  ద ఫ్యామిలీ మ్యాన్‌కి సీక్వెల్‌గా రూపొందుతున్న ద ఫ్యామిలీ మ్యాన్ 2లో స‌మంత కీల‌క పాత్ర పోషిస్తుంది. గ‌త కొద్ది రోజులుగా దీనిపై అనేక వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్ట‌గా, తాజాగా సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది సామ్. కీల‌క పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ఇచ్చినందుకు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేకు సామ్‌ కృతజ్ఞతలు తెలిపింది. అయితే తొలి సారి వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్న స‌మంత పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఆ పాత్ర‌కి సంబంధించి భిన్న ఊహాగానాలు వ‌స్తున్నాయి. టెర్ర‌రిస్ట్ పాత్ర‌లో స‌మంత న‌టించ‌నుంద‌ని కొంద‌రు అంటుంటే మ‌రొకరు కిడ్నాపర్ అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: