ఈరోజు విడుదలైన ‘అర్జున్ సురవరం’ ఓవర్సీస్ టాక్ నిఖిల్ కు జోష్ ను కలిగించే విధంగానే కనిపిస్తోంది. ఈ మూవీ నిడివి 149 నిముషాలు ఉన్నా ఎక్కడా బోర్ అనిపించకుండా కథలో చాల ట్విస్ట్ లు ఉండటంతో ప్రేక్షకులకు అసహనం కలగదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

ఈ మూవీలో నిఖిల్ అర్జున్ లెనిన్ సురవరంగా ఎంట్రీ ఇవ్వడం దగ్గర నుండి ఆ తరువాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ లోకి కథను చాల సులువుగా దర్శకుడు మలుపులు తిప్పుతూ తీసుకు వెళ్ళడంతో ఈ మూవీని చూసిన ప్రేక్షకులకు పెద్దగా అసహనం కలగదు అని అంటున్నారు. దీనికితోడు నిఖిల్ లావణ్యల మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో లావణ్యా త్రిపాఠికి మళ్ళీ మంచిరోజులు వచ్చే ఆస్కారం ఉంది అన్న అభిప్రాయం కూడ వ్యక్తం అవుతోంది. 

ముఖ్యంగా లాయర్ గా వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ ఈ మూవీని చూసే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఓవర్సీస్ ప్రేక్షకుల అభిప్రాయం. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్స్ తయారు చేసే మాఫియా చుట్టూ తిరిగే కథను చాల జాగ్రత్తగా డీల్ చేస్తూ తెలివిగా కామెడీ మూడ్ లోకి తీసుకు రావడంలో దర్శకుడు సక్సస్ అయ్యాడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

మూవీ ప్రారంభంలోనే చిరంజీవికి కృతజ్ఞతలు తెలుపుతూ టైటిల్ కార్డ్స్ వేయడంతో మెగా అభిమానులను ఆకర్షించడానికి నిఖిల్ చాల తెలివిగా వ్యూహాలు రచించాడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమాకి విడుదల అవుతుంది అనుకున్న రామ్ గోపాల్ వర్మ మూవీ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని టైటిల్ మార్చుకున్నా ఈ మూవీ విడుదలను హైకోర్టు నిలుపుదల చేయడంతో నిఖిల్ కు పోటీలేని వాతావరణం ఏర్పడి ‘అర్జున్ సురవరం’ కు అన్ని విధాల అవకాశాలు కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ మూవీ పై తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకుల తీర్పును బట్టి ఈ మూవీ సక్సస్ ఆధారపడి ఉంటుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: