నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన పటాస్ సినిమా ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. కాగా ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ అందుకున్న అనిల్, ఆ తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ అనే సినిమాని తెరకెక్కించి ద్వితీయ విఘ్నాన్ని అధిగమించడంతో పాటుగా మరొక సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 

 అనంతరం రవితేజ తో రాజా ది గ్రేట్, ఆ తరువాత విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కలయికలో వచ్చిన ఎఫ్2 సినిమాల తో కూడా విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి, కెరీర్ పరంగా ఇప్పటివరకు ఒక్క అపజయాన్ని కూడా చవిచూడని దర్శకుడిగా విజయవంతం గా ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా ను తీస్తున్న అనిల్, ఎలాగైనా ఈ సినిమాతో కూడా మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

 

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా అఫీషియల్ టీజర్ ని బట్టి చూస్తుంటే అనిల్ మరొక హిట్ కొట్టేలా ఉన్నారని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఆయన తదుపరి సినిమా విషయమై నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వాటిని బట్టి అనిల్ తదుపరి సినిమా యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఉండనుందని ఆ వార్త సారాంశం. నిజానికి రాజా ది గ్రేట్ సినిమా ని మొదట రామ్ తో చేద్దాం అని భవించారట అనిల్, అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆయనతో చేయలేకపోయానని అనిల్ గతంలో చెప్పడం జరిగింది. కాగా ఇటీవల రామ్ ని కలిసి ఒక కథ ఆయనకు వినిపించడం, అది రామ్ కి నచ్చడం జరిగిపోయాయట. ఇక ఈ సినిమా ఫిబ్రవరీలో మొదలవుతుందని సమాచారం. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక మాత్రం ప్రకటన వెలువడవలసి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: