ఎప్పుడు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలిచే వారు ఎవరైనా ఉన్నారంటే అది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అదేవిధంగా శ్రీరెడ్డి. ఇద్దరికిద్దరు షాకింగ్ పోస్టులు సోషల్ మీడియా లో పెడుతూ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అవుతూ ఉంటారు. అప్పట్లో కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉంది అంటూ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను హీరోయిన్లు చేయకుండా అడ్డుకుంటుంది తెలుగు డైరెక్టర్ లే అంటూ ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పేసి నిరసనకు కూర్చున్న శ్రీ రెడ్డి అప్పట్లో మెగా కుటుంబంపై మరియు అదే విధంగా పవన్ కళ్యాణ్ పై దారుణమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో అప్పటి నుండి ఇప్పటి వరకు  వార్తల్లో నిలుస్తూ వస్తున్న శ్రీ రెడ్డి తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కి సోషల్ మీడియాలో ఓపెన్ ఆఫర్ ఇస్తు పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెలుగు మీడియాలో మరియు అదే విధంగా తెలుగు సినిమా రంగంలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

ప్రస్తుతం శ్రీరెడ్డి కోలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో..రాంగోపాల్ వర్మ కి బంపర్ ఆఫర్ ఇస్తూ...వర్మకు డేటింగ్ అఫర్ ఇస్తున్నట్టుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన పేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. 

 

శ్రీరెడ్డి ఓపెన్ అఫర్ ను వర్మ అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోపక్క తాజాగా వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదల విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకుంటున్న తరుణంలో రామ్ గోపాల్ వర్మ...శ్రీ రెడ్డి ఇచ్చిన ఆఫర్ పై ఏవిధంగా స్పందిస్తారో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: