తెలుగు దేశం పేరు చెప్పినా ముఖ్యంగా చంద్రబాబు పేరు వింటే చాలు రెచ్చిపోయి నెగిటివ్ కామెంట్స్ తో సంచలనాలు క్రియేట్ చేస్తుంది రోజా. గతంలో రోజా బాలయ్యను టార్గెట్ చేస్తూ కూడ కామెంట్స్ చేసింది. అలాంటి రాజా తో బాలకృష్ణ చేతులు కలపడానికి సిద్ధ పడుతున్నట్లు వార్తలు రావడం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. 

బోయపాటి బాలకృష్ణల కాంబినేషన్ లో రూపొందబోయే మూవీలో ఒక నెగిటివ్ పాత్రను సంజయ్ దత్ తో చేయించడానికి బోయపాటి గట్టి ప్రయత్నాలు ఇప్పటికే కొనసాగిస్తున్నాడు. ఈ ప్రయత్నాలు ఇలా కొనసాగుతూ ఉండగానే ఈ మూవీలో కీలకంగా ఉండే మరో లేడీ విలన్ పాత్రను రోజాతో చేయించడానికి బోయపాటి రాయబారాలు చేస్తున్నట్లు టాక్. 

బోయపాటి సూచనకు బాలయ్య కూడ ఓకె అన్నట్లు టాక్. ఇప్పటికే రోజా క్యాబినెట్ హోదా కలిగిన పదవిలో కొనసాగుతున్న పరిస్థితులలో రోజా ఈ మూవీలో నటించవలసి వస్తే ప్రభుత్వం అనుమతులు తీసుకోవలసి వస్తుంది అని అంటున్నారు. అయితే జగన్ చిన్ననాటి నుండి బాలయ్య వీరాభిమాని కావడంతో రోజా కోరికను తిరస్కరించకుండా అంగీకరించి సినిమాలు వేరు రాజకీయాలు వేరు అనే సంకేతాలు ఇచ్చే ఆస్కారం ఉంది అని తెలుస్తోంది.

ఈ వార్తలే నిజం అయితే బాలయ్య బోయపాటిల కాంబినేషన్ మూవీకి ప్రారంభం కాకుండానే భారీ క్రేజ్ వచ్చే ఆస్కారం ఉంది. ఒకవైపు సంజయ్ దత్ మరొక వైపు రోజా విలన్ పాత్రలను బాలయ్య తన పంచ్ డైలాగ్స్ తో ఎదిరిస్తే ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనితో మళ్ళీ బాలయ్య ట్రాక్ లోకి వచ్చాడు అంటే అతడిని ఆపడం అంత సులువైన పని కాదు అని అనుకోవాలి. అయితే బోయపాటి రాయబారానికి రోజా తనకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి అని చెప్పినట్లు కూడ మాటలు ఉన్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: