ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ ల సందడి ఎక్కువైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది మరీ ఎక్కువైంది.  అయితే ఈ బయోపిక్ లు ఎక్కువ శాతం రాజకీయ నాయకుల జీవితాలవే ఉండటం విశేషం. మొన్నటికి మొన్న భారత ప్రధాని మోదీ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో సినిమా వచ్చింది. ప్రస్తుతం మోదీ జీవిత కథ మీద మరో సినిమా కూడా రాబోతుంది. దివంగత తమిళ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా మూడు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 

 

అయితే వీటిలో ఒకటి వెబ్ సిరీస్ కూడా ఉంది. జయలలిత సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మీద ప్రజల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. "తలైవి" పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుంది. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథని సమకూరుస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయింది. 

 

కాగా ఈ బయోపిక్ లో ఓ అంశం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అలనాటి అమ్మాయిల కలల హీరో శోభన్ బాబు – జయలలిత మధ్య చక్కటి అనుబంధం ఉందని అప్పట్లో బాగా రూమర్స్ వచ్చాయి. అయితే వారి మధ్య నిజంగానే బంధం ఉందా..లేదాఅనే అంశాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. "తలైవి" లో ఈ అంశం అందర్నీ ఆకట్టుకుంటుందట. మరి ఈ అంశం ఏమైనా సరికొత్త వివాదాలకు దారి తీస్తుందా అనేది చూడాలి.

 

 

ఇక జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా చూపించనున్నారు. దాంతో కంగనా 16 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ సినిమాలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: