భారతీయ సినిమా ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ ఎంత ముఖ్యమో హీరోల డ్యాన్స్ లు కూడా అంతే ముఖ్యం. ఇండియన్ సినిమాల్లో తమ డ్యాన్సులతో ఆకట్టుకున్న హీరోలెందరో ఉన్నారు. ప్రస్తుతం రెండు అగ్ర చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. తమ హీరో గొప్ప డ్యాన్సర్ అంటే.. కాదు మా హీరో గొప్ప డ్యాన్సర్ అంటూ వాదనలు నడుస్తున్నాయి. వారిద్దరిలో.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరైతే.. రెండో హరో తమిళ స్టార్ హీరో విజయ్.

 

 

ఇద్దరి కామన్ అభిమాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇందుకు కేంద్రంగా మారింది. ఎన్టీఆర్విజయ్ ల్లో ఎవరు బెస్ట్ డ్యాన్సర్ అనే పోల్ పెట్టడమే ఈ వివాదానికి కారణమైంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు, విజయ్ అభిమానులు తమ తమ హీరోలే డ్యాన్సుల్లో టాప్ అంటూ కామెంట్స్ పెట్టారు. ఇది కాస్తా తెలుగు, తమిళ సినీ పరిశ్రమ గొప్పలు వరకూ వెళ్లిపోయింది. వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లిపోయింది. నిజానికి వీరిద్దరూ బెస్ట్ డ్యాన్సర్స్ అనడంలో సందేహం లేదు. కానీ ఎవరి అభిమానులకు వారి హీరోలు గొప్ప. కామన్ గా పెట్టిన ఈ పోస్ట్ కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.

 

 

నిజానికి దేశవ్యాప్తంగా డ్యాన్సులకు పేరు, వన్నె తెచ్చింది మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. తన డ్యాన్సులతో హిందీ ప్రేక్షకులే ఔరా అనుకునేలా చేశాడు. ఆయన సృష్టించిన డ్యాన్సింగ్ సెన్సేషన్ అలాంటిది. తర్వాత తరంలో బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్, రామ్.. ఇలా మంచి డ్యాన్సర్లుగా పేరు తెచ్చుకున్నారు. తమిళ్ లో కూడా డ్యాన్సర్లు ఉన్నారు. ప్రభుదేవా, లారెన్స్ హీరోలుగా చేసినా స్వతహాగా వారు డ్యాన్స్ మాస్టర్లు. కాబట్టి.. అభిమానులు ఇలాంటి గొడవలకు వెళ్లకపోవడమే బెటర్. ఎవరి హీరోలు వారికి గొప్ప.

 

మరింత సమాచారం తెలుసుకోండి: