ఈ తరంలో సినిమాలకి ఎంత క్రేజ్చ్ ఉందో వెబ్ సిరీస్ లకి కూడా అంతే క్రేజ్ ఉంది. సినిమాగా మలచడానికి కష్టమయ్యే సబ్జెక్టులన్నీ వెబ్ సిరీస్ ల ద్వారా దర్శనమిస్తున్నాయి. సినిమా ద్వారా అన్నీ చెప్పడం కష్టం గనక అలాంటి విషయాలన్నింటినీ వెబ్ సిరీస్ ద్వారా చెబుతున్నారు. వెబ్ సిరీస్ లో ఉన్న స్వేచ్చ కారణంగా చాలా మంది దర్శకులు తాము అనుకున్నట్టుగా చెప్పడానికి వెబ్ సిరీస్ లు చేస్తున్నారు.

 

అయితే వీటికి ఆదరణ కూడా చాలా ఎక్కువగా ఉంది. మెయిన్ స్ట్రీమ్ నటీ నటులు కూడా ఈ వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత కూడా వెబ్ సిరీస్ లో నటిస్తుందని తెలిసింది. అయితే ప్రస్తుతం ఇదే బాటలో మరో భామ కూడా చేరింది. తెలుగు, తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా మరి కొద్ది రోజుల్లో వెబ్ సిరీస్ లో కనిపించనుంది.

 

`ది నవంబర్ స్టోరి` అనేది టైటిల్. ఇది తండ్రి కూతుళ్ల మధ్య సాగే ఆసక్తికర డ్రామాతో తెరకెక్కనుంది. దుర్మార్గుడు హంతకుడు అయిన తండ్రి (జీఎం కుమార్) వల్ల కూతురు పడే పాట్లు ఏమిటన్నది తెరపై చూపిస్తారట. తండ్రిని కాచుకునేందుకు సన్నివేశాల్ని ఆ కూతురు ఎలా డీల్ చేస్తుందో చూడొచ్చట. ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆ మేరకు ఇప్పటికే మిల్కీ బ్యూటీ ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. 

 

రామ్ సుబ్రమణియన్ దీనికి దర్శకత్వంలో వికటన్ గ్రూప్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తోంది. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ దీనిని తెరకెక్కించనున్నారు.  అయితే ఈ వెబ్ సిరీస్ గురించి తమన్నా ఆసక్తికరమైన కామెంట్ చేసింది. ఒక్క వెబ్ సిరీస్ లో నటించడం ద్వారా ఐదు సినిమాలో నటించినంత అనుభవం వస్తుందట. అంతే కాదు టాలెంటుని నిరూపించుకోవడానికి వెబ్ సిరీస్ లలో స్కోప్ ఎక్కువగా ఉంటుందని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: