టాలీవుడ్ యంగ్ హీరో వ‌రుస‌గా వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ బాక్సాఫీస్ రేసులో దూసుకు పోతున్నాడు. ఈ క్ర‌మంలోనే నిఖిల్ న‌టించిన తాజా చిత్రం అర్జున్ సుర‌వ‌రం. నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నటించిన ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. నిఖిల్ గత సినిమా ‘కిర్రాక్ పార్టీ’ తో పోలిస్తే త‌క్కువ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగినా ఇది మంచి బిజినెస్సే అని చెప్పాలి.

 

ఆంధ్ర – నైజాంలో కలిపి ఈ సినిమాని సుమారు 7.2 కోట్లకి కొనుగోలు చేశారు. మిగిలిన ప్రమోషన్స్ ట్యాక్స్‌లు అన్ని క‌లుపుకుంటే ఈ సినిమా రు 7.5 కోట్ల మార్క్ షేర్ రాబ‌డితే బ్రేక్ ఈవెన్ అని చెప్పాలి. ఆ మాత్రం షేర్ వ‌స్తేనే డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాభాలు వ‌స్తాయి. ఇక యేడాది క్రిత‌మే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కు వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

 

ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కు మెగాస్టార్ చిరంజీవి వ‌చ్చి స్వ‌యంగా ఈ సినిమాను ప్ర‌మోట్ చేయాల‌న్న ఉద్దేశంతో తాను పిల‌వ‌క పోయినా వ‌చ్చాన‌ని చెప్ప‌డంతో మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. గత కొంతకాలంగా ఓ మంచి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తుండడం లాంటి అంశాలు నిఖిల్ కి చాలా పెద్ద ప్లస్ కానున్నాయి. 

 

ఇక సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో ఈ మాత్రం షేర్ రావ‌డం పెద్ద క‌ష్టం కాదు. ప్ర‌స్తుతం మార్కెట్లో పెద్ద సినిమాలు లేక‌పోవ‌డం కూడా నిఖిల్‌కు క‌లిసి రానుంది. ఈ టాక్‌తో రు. 7 కోట్ల షేర్ రాబ‌ట్ట‌డం అంటే చాలా సింపుల్ అనే చెప్పాలి. మ‌రి నిఖిల్ ఏం చేస్తాడో ?  చూడాలి. బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: