యంగ్ హీరో నిఖిల్ లేటెస్ట్ సినిమా అర్జున్ సుర‌వ‌రం. నిఖిల్ - లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా తెర‌కెక్కిన ఈ సినిమా యేడాది క్రిత‌మే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా ఆర్థిక , ఇత‌ర‌త్రా కార‌ణాల నేప‌థ్యంలో పాలు సార్లు వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ సినిమాకు మంచి టాక్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్లు , ఫ‌స్ట్ షోలు కంప్లీట్ అవ్వ‌డంతో సినిమా బాగుంద‌నే అంటున్నారు.

 

ఓ సాధారణ టీవీ ఛానల్లో ఇన్వెస్టిగేషన్, స్టింగ్‌ ఆపరేషన్ స్పెషలిస్టు అయిన రిపోర్టర్ బిబిసి ఛానల్  జర్నలిస్ట్ గా ఎలా ఎదిగాడు... ఈ క్రమంలోనే అతడు ఎలాంటి ? ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడ్డాడు.... ఇలాంటి సీరియస్ కథతో తెరకెక్కిన అర్జున్ సురవరం సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో నిఖిల్ నటనతో పాటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్... సీరియస్ మోడ్లో సాగే కథనం... హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వర్కౌట్ అయిన నిఖిల్‌ కెమిస్ట్రీ హైలెట్స్‌గా ఉన్నాయి.

 

ఇక ఈ సినిమాలో నిఖిల్ క్యారెక్టర్ జర్నలిజం గౌరవాన్ని పెంచేలా ఉంది దర్శకుడు ఎంచుకున్న కథాంశం తో పాటు నటన క్లైమాక్స్ సినిమాకు ఆయువుపట్టు గా నిలిచాయి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ అర్జున్ లెనిన్ సురవరం ఫ‌స్టాఫ్‌లో స్లోగా స్టార్ట్ అయినా ఆ త‌ర్వాత సీరియ‌స్ మోడ్‌లోకి ఎప్పుడైతే ఎంట‌ర్ అయ్యిందో అప్ప‌టి నుంచి ప్రేక్ష‌కుడు ఈ సినిమా క‌థ‌తో ట్రావెల్ అవుతాడు.

 

ఇంట‌ర్వెల్‌కు ముదు 30 నిమిషాలు.. ఇంట‌ర్వెల్ ట్వ‌స్టులు... సెకండాఫ్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. దర్శకుడు టి ఎన్ సంతోష్ తెరకెక్కించిన తీరు తాను చెప్పాలనుకున్న పాయింట్ ను తెలుగు నేటివిటీకి కూడా బాగా ఆవిష్కరించడంలో విజయం సాధించారు. బీ, సీ సెంట‌ర్ల కంటే ఈ సినిమా మ‌ల్టీఫ్లెక్స్ ఆడియెన్స్‌ను బాగా ఇంప్రెస్ చేస్తుంది. అయితే కమర్షియల్ హంగులు తక్కువ కావడం ఈ చిత్రాన్ని ఎంత వరకు తీసుకెళ్తాయో ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: