ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన మెగా స్టార్ చిరంజీవి భారీ ఇంటికి సంబంధించిన మరొక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు బయటకు లీక్ అయి అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 25000 ల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించ బడ్డ ఈ భారీ ఇంటిని నిజామ్ స్టైల్ డిజైన్ లో కొన్ని రూమ్స్ కు ఇంటీరియర్ చేస్తున్నట్లు సమాచారం. 

ఇటాలియన్ మార్బుల్ తో మెరిసిపోయే ఈ ఇంటిలో 18వ శతాబ్దపు వాతావరణం కొన్ని గదులలో కనిపించడానికి ఒకప్పటి నిజామ్ నవాబులు వాడిన కబోర్డ్స్ అదేవిధంగా ఆ కాలంనాటి గ్లాస్ కు సంబంధించిన డిజైన్స్ కొన్ని సింగపూర్ లోని వింటేజ్ ఫర్నిచర్ వ్యాపారం చేసే ఒక ప్రముఖ వ్యాపార సంస్థ దగ్గర ఉన్న విషయాన్ని తెలుసుకుని ఆ ఫర్నిచర్ సంస్థ త్వరలో నిర్వహించబోయే వేలం పాటలో పాల్గొనడానికి సింగపూర్ వెళ్ళబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. 

చిరంజీవితో పాటు రామ్  చరణ్ ఉపాసనలు కూడ వెళ్ళి అక్కడ ఒక రాజమహల్ ను తలపించే తమ ఇంటికి అవసరమైన 18వ శతాబ్దపు కాలంనాటి నిజామ్ దర్బాన్ని తెలియచేసే ఫర్నేచర్ కొనబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఇంటికి సంబంధించిన గ్లాస్ ఫ్రేమింగ్ వర్క్స్ చాల ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా చాల కళాత్మకంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ ఇంటిలో ఇలాంటి వింటేజ్ ఫర్నిచర్ ఉన్న వాటికి సంబంధించిన ఫోటోలో ఎప్పుడు మీడియాకు లీక్ కాలేదు. 

అయితే చిరంజీవి ఎప్పుడు మీడియాకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి త్వరలోనే చిరంజీవి విలాస వంతమైన ఇంటి ఇంటీరియర్ ఫోటోలు బయటకు వచ్చే అవకాశం ఉంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఇంటిని పరిపూర్ణమైన వాస్తుతో నిర్మించిన నేపధ్యంలో చిరంజీవి మనవడు చరణ్ వారసుడు ఈ ఇంటిలోనే త్వరలో పుట్టి మెగా అభిమానులకు జోష్ ను కలిగిస్తాడని ఆశిద్దాం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: