ఆర్ జి వి.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. ప్రాక్టిల్ గా ఆలోచించడం ఆర్జీవి నైజం. తాను నిర్మించే చిత్రాలు దాదాపుగా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటాయి. అయితే ఈ మద్యకాలంలో వర్మ నిర్మిస్తున్న చిత్రాలు రాజకియ్యాలపై, రాజకీయ నాయకులపై కధ అల్లుకుని ఉంటుంది . ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత రాజకీయ పరిస్థితులపై వర్మ  కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమాలో రాజకీయ హత్యలు.. కులం కుట్రలు.. కుతంత్రాల్ని రివీల్ చేస్తున్నాడు. ఈ సినిమా మొదలు నుండి వివాదాలు క్రియేట్ చేసుకుంటూనే వస్తోంది.

 

కాని సినిమా ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలను అడ్డుకునేందుకు  కొర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. వర్మపై కొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. సినిమా టీజర్ చూసినట్లయితే రాజకీయ నాయకులను కించపరిచే విదంగా ఉన్నాయి. చిత్ర ట్రైలర్లు కూడా పెద్ద దూమారాన్ని లేపాయి. సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చూట్టూ తిరుగుతుండడంతో ఈ సినిమాని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా ఈ సినిమాలోని ఒక ఐటం సాంగ్ లో 'ఇప్పటి రాజకీయ కుట్రలని చూస్తే మహాభారతంలో శకుని కూడానా షాకైపోతాడు.. మాటలు రానోళ్లే స్పీచులు ఇస్తారు'  అంటూ రాజకీయ నాయకులను కించపరిచే విధంగా ఉన్నాయి. ఈ సినిమాలోని 'పప్పులాంటి అబ్బాయి...' అంటూ సాగే పాటను వర్మ విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ పాట ఇండియాలోనే ట్రెండింగ్‌లో తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ పాటను 16 లక్షల మందికి పైగా వీక్షించారు.దీనికితోడు సామాజిక వర్గాల పేర్లు టైలిల్ లో వాడటం వల్ల సినిమా పేరు మార్చాలని హైకోర్టు సెన్సార్ బోర్డుకు సూచించింది.  అయితే వర్మ ముందుగానే  టైటిల్ విషయంలో పక్కా ప్లాన్  తో ఉన్నాడు. అమ్మరాజ్యంలో కడపబిడ్డులు అనే టైటిల్ ని మార్చడానికి సిద్దంగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: