యువరత్న నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. కోలీవుడ్ డైరెక్ట‌ర్‌ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న థియేటర్లలోకి దిగుతోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో బాలయ్య - బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కథ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నుంచి బోయపాటి... బాలయ్య సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ విలన్ రోల్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజాను సంప్రదించినట్టు రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

రోజా ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గా ఉండడంతో పాటు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె సినిమాలకు దూరంగా ఉన్న జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాలో విల‌న్ రోల్ ఆమె స్వీకరించేందుకు సిద్ధంగా లేనని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవైపు రాజకీయాలు... మరోవైపు జబర్దస్త్ ప్రోగ్రాంతో బిజీ బిజీగా ఉన్నానని చెప్పిన రోజా టిడిపి ఎమ్మెల్యే బాలయ్య సినిమాలో విల‌న్ రోల్ చేయడం అంత కరెక్ట్ కాదేమో అన్న సందేహం వ్యక్తం చేశారట.

 

అదే నిజమైతే బాలయ్యకు రోజా మామూలు షాక్‌ ఇవ్వలేదనే చెప్పాలి. గతంలో వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించినా ఇప్పుడు రాజకీయంగా వేర్వేరు పార్టీలో ఉన్నారు. పైగా ఏపీలో ప్ర‌స్తుతం వైసిపి, టిడిపి మధ్య పెద్ద ఎత్తున మాట‌ల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కూడా రోజా టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య సినిమాలో విలన్ వేసేందుకు అంత సుముఖంగా లేదని అంటున్నారు. ఇక మ‌రి రోజా నో చెప్పే ఉద్దేశంలో ఉండ‌డంతో ఇప్పుడు బాల‌య్య‌కు త‌గ్గ ప‌వ‌ర్ ఫుల్ లేడీ విల‌న్ కోసం బోయ‌పాటి ఇంకొక‌రిని వెతుక్కోక త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: