సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ 13 సంవత్సరాల క్రితమే టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు. మెగాపవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా రామ్ చరణ్ వరుస విజయాలు అందుకొంటున్నాడు. సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ ఇప్పటికే తెరంగేట్రం చేశారు. నాగచైతన్య నటించిన సినిమాలు హిట్ కావడంతో మీడియం రేంజ్ హీరోగా నాగచైతన్యకు గుర్తింపు వచ్చింది. 
 
అఖిల్ మాత్రం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలకృష్ణ అభిమానులు ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ మోక్షజ్ఞ సినిమాల్లోకి రావాలని నందమూరి అభిమానులు కళ్లు కాయలు చేసేలా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలల క్రితం మోక్షజ్ఞ బొద్దుగా ఉన్న ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ లుక్ తో బాలకృష్ణ అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. ఆ తరువాత మోక్షజ్ఞ బరువు తగ్గటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా బాలకృష్ణ ఫ్యామిలీకి సంబంధించిన ఒక పిక్ వైరల్ అయింది. ఈ పిక్ లో కూడా మోక్షజ్ఞ ఒళ్లు చేసి కనబడుతున్నాడు. ఈ పిక్ చూసిన బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. 
 
నందమూరి వారసులైన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీయార్ మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. పిక్ చూసిన బాలయ్య అభిమానులు అసలు మోక్షజ్ఞకు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా...? లేదా...? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మోక్షజ్ఞకు సినిమాలంటే ఆసక్తి లేదని మోక్షజ్ఞ బిజినెస్ చూసుకుంటాడని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి స్పందించాల్సి ఉంది. మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే మొదటి సినిమా బోయపాటి శ్రీను లేదా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: